Snake bites man twice in Rajasthan
Snake bites man twice in Rajasthan: పాములు పగబడతాయా..వెంటాడి మరీ కాటేస్తాయా? అంటే కాదని కొంతమంది.. అవునని మరికొందరు అంటుంటారు. రాజస్థాన్ లో ఓ వ్యక్తిని పాము కాటేసిన విధానం చూస్తే పగబట్టిందా ఏంటీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకేపాము ఒకే మనిషిని చనిపోయేవరకు కాటేయటం గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓ వ్యక్తిని పాము కాటేసింది. కాముకాటుతో అతను ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నాడు. ఆ తరువాత అదే మనిషిని అదే పాము మరోసారి కాటేసింది. దీంతో అను ప్రాణాలు కోల్పోయాడు..
రాజస్థాన్ ( Rajasthan)లోని జోధ్ పూర్ జిల్లా(Jodhpur District)లోని మెహ్రాన్ గడ్ గ్రామం( Mehrangad Village)లో జసబ్ ఖాన్ (Jasab Khanఅనే వ్యక్తి కుటుంబంతో జీవిస్తున్నాడు. అతనిని జూన్ 20(2023)న పాముకాటుకు గురయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ప్రోఖ్రాన్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. నాలుగు రోజులు చికిత్స తరువాత జసబ్ కోలుకున్నాడు. దీంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేయగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో గత సోమవారం అంటే జూన్ 25న ఇంటికి తిరిగి రాగా ఆ మర్నాడే ఆ పాము మళ్లీ కాటువేసింది(Snake bites man twice). ఏదో అతని కోసమే ఎదురు చూసినట్లుగా..
ఈసారి రెండో కాలిపై కాటు వేయటంతో కుటుంబ సభ్యులు అతడ్ని జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అలా జసబ్ ఎడారుల్లో ఉండే వైపర్ జాతికి చెందిన పాము కాటుకు గురయి ప్రాణాలు కోల్పోయాడు.దీంతో స్థానికులు జసబ్ పై ఆ పాము పగబట్టిందని అందుకే రెండుసార్లు కాటువేసిందని అంటున్నారు.
Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!
ఈ వింత ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా..రెండుసార్లు పాము కాటు వల్ల మరణించినట్లుగా తేలింది. జసబ్ ఖాన్‌కు తల్లి, భార్య, నలుగురు కుమార్తెలు, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా..జసబ్ పై పగబట్టి రెండుసార్లు కాటేసిన పాముపై అతని కుటుంబ సభ్యులు నిజంగానే పగబట్టారు. జసబ్ ఖాన్ మరణానికి కారణమైన ఆ పామును వెతికి వెతికి చంపారు.