Rajasthan Earthquake Of Magnitude 3.8 Jolts Jaipur
Rajasthan Eartquake : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. జైపూర్‌కు 92 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. స్వల్ప భూకంపం అయినప్పటికీ ఇళ్లలోని వారంతా భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ భూప్రకంపనలు సంభవించాయి.
దాంతో అక్కడి స్థానికుల్లో భయాందోళనకు గురయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో ఇదే అత్యంత బలమైన భూకంపమని చెబుతున్నారు అధికారులు. సికార్ సిటీతో పాటు, దంతారామ్‌ఘర్, ధోడ్, ఖతుశ్యాంజీ, పల్సానా వంటి అనేక సమీప ప్రాంతాలకు భూకంప ప్రభావం విస్తరించింది. భూమి కంపించిన వెంటనే భయంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు వచ్చారు. భూకంప కేంద్రం పరిసరాల్లోని పలు ఇళ్లకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. భూకపం కేంద్రం దేవ్‌ఘర్‌లోని ఆరావళి ప్రాంతమని భౌగోళిక నిపుణుడు ముఖేష్ నిథర్వాల్ తెలిపారు. ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు.
అంతర్గత కదలికలతోనే భూకంప ప్రకంపనలు సంభవించి ఉంటాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగిన కొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూకంపం మూడు నుంచి నాలుగు సెకన్ల పాటు సంభవించిన దానికంటే ఎక్కువ సమయం ఉందని నిథర్వాల్ చెప్పారు. దీని వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. భూప్రకపంనలు కొంత వ్యవధి వరకు అలానే ఉంటే.. ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదన్నారు.
Earthquake of Magnitude:3.8, Occurred on 18-02-2022, 08:01:24 IST, Lat: 27.55 & Long: 75.19, Depth: 5 Km ,Location: 92km NW of Jaipur, Rajasthan, India for more information Download the BhooKamp App https://t.co/1dNw4HD6pd @ndmaindia @Indiametdept pic.twitter.com/vnESAKZ0SK
— National Center for Seismology (@NCS_Earthquake) February 18, 2022
మరోవైపు.. జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో రెండు రోజులుగా భూమి స్వల్పంగా కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.02 గంటల సమయంలో కత్రాలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు NCS వెల్లడించింది. బుధవారం ఉదయం 5.43 గంటలకు పహల్గామ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదైంది.
Read Also : Earthquake: ఉత్తరకాశీలో ఉదయం 5గంటలకు భూకంపం