Bluetooth Earphone : బాబోయ్.. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలి యువకుడు మృతి

బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణం తీశాయి. వైర్‌లెస్ గ్యాడ్జెట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒక్కసారిగా పేలడంతో యువకుడు స్పాట్ లోనే చనిపోయాడు.

Bluetooth Earphone : బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణం తీశాయి. వైర్‌లెస్ గ్యాడ్జెట్ అయిన బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ఒక్కసారిగా పేలడంతో యువకుడు స్పాట్ లోనే చనిపోయాడు. రాజస్తాన్ లో ఈ ఘటన జరిగింది. జైపూర్‌లోని చౌము ప్రాంతంలోని ఉదైపురియా గ్రామానికి చెందిన రాకేశ్ నగర్‌ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఫోన్‌ కాల్ మాట్లాడుతున్నాడు.

ఇంతలో అకస్మాత్తుగా ఆ బ్లూట్ ఇయర్‌ఫోన్ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక పేలుడు ధాటికి యువకుడి రెండు చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అపస్మారకస్థితిలో పడిపోయిన రాకేశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తుండగా.. హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ పేలిన సమయంలో అతడికి గుండెపోటు వచ్చి ఉంటుందని, ఆ కారణంగానే రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు భావిస్తున్నారు. కాగా, దేశంలో ఈ తరహా ఘటన(బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ పేలి చనిపోవడం) ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.

బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలి యువకుడు మృతి చెందాడనే వార్త కలకలం రేపుతోంది. మనలో చాలామంది ఎలక్ట్రానిక్ డివైజ్ లు, గ్యాడ్జెట్స్ వాడుతుంటారు. ఇక ఇయర్ ఫోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొబైల్ ఫోన్ వాడే వారిలో దాదాపు అంతా ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ వాడుతుంటారు. కొందరు వైర్ లెస్ గ్యాడ్జెట్స్ వినియోగిస్తూ ఉంటారు. ఫోన్ లో మాట్లాడేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని ఇవి వాడుతుంటారు. అయితే, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రాణం తీశాయనే వార్త వాటిని వాడే వారిలో వణుకుపుట్టిస్తోంది. ఆందోళనకు గురి చేస్తోంది. ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ వాడాలంటే భయపడుతున్నారు. కాగా, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలడానికి కారణం ఏంటి? అసలు అవి ఏ కంపెనీవి? ఈ వివరాలు తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు