అగస్టా కుంభకోణం కేసులో సక్సేనాకు బెయిల్

అగస్టా వెస్ట్ లాండ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన రాజీవ్ సక్సేనాకి ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు  సోమవారం(ఫిబ్రవరి-25,2019) బెయిల్ మంజూరు చేసింది. రూ.5లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయవద్దని కోర్టు సక్సేనాకు సూచించింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని,కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని సక్సేనాని కోర్టు ఆదేశించింది.

ఈడీ రికమండేషన్ ప్రకారం 24గంటలపాటు సక్సేనాకి రక్షణగా ముగ్గురు గన్ మెన్ లకు కోర్టు ఓకే చెప్పింది. అగస్టా హెలికాఫ్టర్ల డీల్ లో సక్సేనాకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో సక్సేనాను దుబాయ్ పోలీసులు భారత్ కు అప్పగించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు