Army Chopper Crash : బిపిన్ రావత్ కండీషన్ సీరియస్..ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ ప్రకటన!

తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం సైనిక హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. ఈ ఘటనపై

Rajnath2

Army chopper crash  తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం సైనిక హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే వాయుసేన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

వెల్లింగ్టన్ వెళ్లేందుకు బుధవారం సూలూర్ ఎయిర్ బేస్ నుంచి  టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయిన Mi-17V5 హెలికాప్టర్​లో త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది.

ఆర్మీ హెలికాప్టర్​ ప్రమాదంలో ఇప్పటివరకు 11మంది మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాలను వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.  అయితే హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ALSO READ Bipin Rawat : తమిళనాడులో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌లో ‘బిపిన్‌ రావత్‌’