Rajya Sabha : పోస్టాఫీస్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, శాంతి భద్రతలు, అత్యవసర పరిస్థితులు లేదా ప్రజా భద్రత వంటి సందర్భాల్లో ఏదైనా వస్తువు లేదా కవరును తెరచి చూసి, స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు లభిస్తుంది.

Rajya Sabha

Rajya Sabha – Post Office Bill : పోస్టాఫీస్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 125 ఏళ్ల నాటి ఈ చట్టాన్ని సవరించడం వల్ల ప్రభుత్వానికి కీలక అధికారాలు లభించనున్నాయి. దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, శాంతి భద్రతలు, అత్యవసర పరిస్థితులు లేదా ప్రజా భద్రత వంటి సందర్భాల్లో ఏదైనా వస్తువు లేదా కవరును తెరచి చూసి, స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు లభిస్తుంది. దీని కోసం ఏదైనా అధికారికి అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వొచ్చు.

దేశ భద్రత కోసమే ఈ నిబంధనలను ఏర్పాటు చేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా, ఈ బిల్లును వామపక్షాలు, ఆమ్ ఆద్మీపార్టీ, టీడీపీ, ఏఐఏడీఎంకే, ఎన్ సీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్సిళ్లను తెరిచి చూసే అధికారాన్ని పోస్టల్ అధికారికి కట్టబెట్టడం వలన వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘనకు గురువుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Manipur: మళ్లీ అట్టుడికిన మణిపూర్‌.. రెండు గ్రూపుల మధ్య తీవ్ర కాల్పులు, 13 మంది మృతి

అలాగే లీగల్ ప్రొఫెషన్ ను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. కోర్టులో న్యాయవాదులు – కక్షిదారుల మధ్య దళారులను తొలగించాలని పార్టీలకు అతీతంగా ఎంపీలు ఏకాభిప్రాయం తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్ సభ ఎథిక్స్ కమిటీ నివేదిక అధారంగా చర్యలు తీసుకోవడానికి ముందు లోక్ సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు