Ayodhya లో రామ జన్మ భూమి పూజ..ఆ ఛానెల్ లో లైవ్

  • Publish Date - July 26, 2020 / 12:28 PM IST

అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగనుంది. మోడీతో పాటుగా…అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు.

రామ జన్మ భూమికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చూసేందుకు ఉత్సాహం చూపిన వారిపై కరోనా నీళ్లు చల్లుతోంది. వైరస్ విస్తరిస్తుండడంతో నిబంధనలు పాటిస్తూ..కార్యక్రమం జరుపుకోవాల్సి వస్తోంది.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత చారిత్రాత్మకంగా అవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం వెల్లడించింది. భూమి పూజ కార్యక్రమం దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమాలను ప్రసారం చేసినట్లుగానే..ఈ పూజ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేస్తుందని వెల్లడించింది.

ఆగస్టు 05వ తేదీన ప్రధాని మోడీ పూజలు చేస్తారని, సాధువులు, పండితులు, ధర్మకర్తలు, ఇతర ప్రముఖులు పూజలు చేయనున్నారని Vishwa Hindu Parishad national spokesperson వినోద్ బన్సల్ వెల్లడించారు.

పూజకు సంబంధించిన జరుగుతున్న పనుల తీరును పరిశీలించేందుకు సీఎం యోగి ఆదిత్య నాథ్ శనివారం అయోధ్యలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 03వ తేదీ వరకు క్లీన్ డ్రైవ్ నిర్వహించాలని, కోవిడ్ ప్రోటోకాల్ లను పాటించాలని సీఎం యోగి ఆదేశించారు.

అయోధ్యలో ఇలాంటి సందర్భం రావడానికి సుమారు 500 సంవత్సరాలు పట్టిందని, అన్ని స్థానిక దేవాలయాల్లో అఖండ్ రామాయణ్ నిరంతరం పారాయణం జరపాలని ప్రజలకు సూచించారు. ఆగస్టు 04వ తేదీ, ఆగస్టు 05వ తేదీ రాత్రి అయోధ్యలోని ప్రతి ఇంట..ఆయిల్ దీపాలను వెలగించాలన్నారు.