దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు 12 ఏళ్ల బాలికపై దాడి చేసి..హింసించి..అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, అనాగరక చర్య అని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని హామీనిచ్చారు.
దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని 2020, ఆగస్టు 04వ తేదీ మంగళవారం సమాచారం వచ్చిందని Joint Commissioner of Police షాలిని సింగ్ తెలిపారు. నిందితుడిని గుర్తించినట్లు ఓ హత్య కేసుతో పాటు..మరో 4 కేసుల్లో నిందితుడని, దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశించాడన్నారు. ఈ సమయంలో 12 ఏళ్ల బాలిక మాత్రమే ఉందని, తల్లిదండ్రులు లేరన్నారు.
అత్యాచారం చేయబోయే ప్రయత్నం చేయగా..బాలిక అడ్డుకుందని, దీంతో పదునైన ఆయుధంతో బాలిక తలపై, ముఖంపై కొట్టాడన్నారు. అనంతరం అత్యాచారం చేసి, పారిపోయడన్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారన్నారు.
బాలికను మొదట..సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ కు తరలించారని చెప్పారు. బాలికకు రక్తస్రావం జరుగుతోందని, పలు సెక్షన్ల కింద..కేసులు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్…2020, ఆగస్టు 06వ తేదీ గురువారం ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కేసులో న్యాయం జరిగేలా..సీనియర్ అడ్వకేట్ ను నియమిస్తామన్నారు. ఆపరేషన్ జరిగిందని, 24 నుంచి 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. ఆసుపత్రికి వచ్చే ముందు..సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. క్రూరమైన దాడి అని, అనాగరిక చర్యగా వెల్లడించారు.