ఆమె కారణంగానే ఠాక్రేకు సీఎం పదవి

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఠాకరే వంశంలోనే తొలి సీఎం కానున్న ఉద్ధవ్ ఠాకరే విజయానికి మూలం అతని భార్య రష్మీ ఠాకరే. అంతేకాదు కొడుకు ఆదిత్య ఠాకరే 19ఏళ్లకే రాజకీయ అరంగ్రేటం చేయడానికి కూడా ఆమే కారణం. ఇది చాలా మందికి తెలియని విషయం. 

చాలా ఏళ్లుగా బీజేపీతో శివసేన ఒప్పందం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆమెదే. శివసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉంటూ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

క్లాస్‌మేట్‌గా ఉద్ధవ్-రష్మీ ఠాకరేల పరిచయం:
ముంబైలోని జేజే ఆర్ట్ స్కూల్‌లో చదువుతుండగా రష్మీ, ఉద్ధవ్ ఠాకరేల పరిచయమైంది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకుని కొన్నాళ్లు ఇంటికి దూరంగా ఉన్న రెండేళ్ల తర్వాత అందరితో కలిశారు. స్వతహాగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఉద్దవ్ ఠాకరే ఆ సమయంలో యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత భార్య రష్మీ ఠాకరే చొరవతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 

భర్త రాజకీయాల్లోకి వెళ్లడానికే కాకుండా కొడుకును 19ఏళ్లకే రాజకీయ అరంగ్రేటం చేసేలా ప్రోత్సహించారు. కేవలం రాజకీయాల్లోనే కాకుండా వ్యాపారంలోనూ అడుగుపెట్టిన రష్మీ ఠాకరే.. సామ్‌వేద్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సహయోగ్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలకు డైరక్టర్ గా పనిచేస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు