Rld Chief Ajit Singh
RLD chief Ajit Singh:మాజీ కేంద్ర మంత్రి, RLD అధినేత చౌదరి అజిత్ సింగ్ కరోనా బారిన పడి మరణించారు. ఆయన వయసు 82 సంవత్సారాలు. అజిత్ సింగ్ కు ఏప్రిల్ 20న కరోనా పాజిటివ్ రావడంతో గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే గురువారం ఉదయం అజిత్ సింగ్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ఆయన కుమారుడు దృవీకరించారు.. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అజిత్ సింగ్ పరిస్థితి క్షీణించడంతో గురువారం కన్నుమూశారని ఆయన కుమారుడు, మాజీ ఎంపి జయంత్ చౌదరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన చౌదరి అజిత్ సింగ్.. ఉత్తరప్రదేశ్ లోని బాగ్‌పాట్ లోక్ సభ స్థానం నుండి ఏడుసార్లు ఎంపిగా విజయం సాధించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పూర్తిచేసిన అజిత్ సింగ్ అమెరికాలోని ఓ కంప్యూటర్ పరిశ్రమలో 15 సంవత్సరాల పాటు పనిచేశారు. 1986 లో రాజ్యసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. విపి సింగ్ క్యాబినెట్ లో అజిత్ సింగ్‌ను కేంద్ర పరిశ్రమ మంత్రిగా చేర్చుకున్నారు. పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆహార మంత్రిగా చేరినప్పటికీ 1996 లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం.. అజిత్ సింగ్ ఆర్‌ఎల్‌డిని ఏర్పాటు చేసి 2001 లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా చేరారు. మే 2003 వరకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వంలో RLD భాగంగా ఉంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అజిత్ సింగ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) లో చేరారు. అయితే గత సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి దూరమై బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.