Maharashtra : “RSS ఆసుపత్రిలో హిందువులకు మాత్రమే వైద్యం చేస్తారా…?”మంత్రి గడ్కరిని ప్రశ్నించిన రతన్ టాటా

RSS ఆసుపత్రిలో హిందువులకు మాత్రమే వైద్యం చేస్తారా...?" అని రతన్ టాటా నితిన్ గడ్కరిని ప్రశ్నించారు. దానికి గడ్కరి ఏం సమాధానం చెప్పారంటే..

‘RSS hospital only for hindus?’ Ratan Tata asked Nitin Gadkari : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఆర్ఎస్ఎస్ అగ్రనేత కేబీ హెడ్గేవార్ పేరుతో నిర్మించారు. ఆ ఆసుపత్రి ప్రారంభానికి వచ్చిన భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని ఓ ప్రశ్న వేశారు.‘‘RSS ఆసుపత్రిలో హిందువులకే వైద్యం చేస్తారా…?’అడిగారు. ఆ విషయాన్ని స్వయంగా మంత్రి గడ్కరీయే తెలిపారు. ఆస్పత్రి ప్రారంభానికి రతన్ టాటాను ఆహ్వానించిన మంత్రి గడ్కరీ రతన్ టాటా సందేహాన్ని తీర్చిన వైనం గురించి గడ్కరి వివరించారు. దానికి తాను రతన్ టాటాకు ఏమని సమాధానం ఇచ్చారో కూడా వివరించారు.

Also read : Akhand Bharat : ‘అఖండ భారతం’ త్వరలోనే సాకారమవుతుంది..దీన్ని ఎవ్వరూ ఆపలేరు : RSS చీఫ్ మోహన్ భగవత్

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం (ఏప్రిల్ 14,2022) పూణేలోని సిన్హాబాద్ ప్రాంతంలో ఓ చారిటబుల్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.గతంలో తనను రతన్ టాటా అడిగిన ఓ ప్రశ్న గురించి వివరిస్తూ..”గతంలో నేను మహారాష్ట్రలో శివసేన-బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో ఔరంగాబాద్ లో కొత్తగా ఆసుపత్రి నిర్మించారు. ఆ ఆసుపత్రికి దివంగత ఆర్ఎస్ఎస్ అగ్రనేత కేబీ హెడ్గేవార్ పేరు పెట్టారు. అయితే ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రతన్ టాటాను పిలుద్దామని ఓ ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు నాకు సూచించారు.

అంతేకాదు, రతన్ టాటాను ఆహ్వానించే బాధ్యతను నాకు అప్పగించారు. దాంతో రతన్ టాటాకు విషయం చెప్పాను. ఆయన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చేందుకు అంగీకరించడంతో, స్వయంగా వెళ్లి తీసుకొచ్చానని తెలిపారు. ఆసుపత్రికి మరికొంతసేపట్లో చేరుకుంటామనగా..రతన్ టాటా నన్నో ప్రశ్న అడిగారు. ఈ ఆసుపత్రిలో కేవలం హిందువులకే వైద్యం చేస్తారా? అని ప్రశ్నించారు. అలా ఎందుకు అనుకుంటున్నారు? అని అడిగాను. ఈ ఆసుపత్రి ఆర్ఎస్ఎస్ కు చెందినది కదా? అని ఆయన బదులిచ్చారు. దాంతో ఆయనకు ఆసుపత్రి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని నేను సవివరంగా తెలిపాను అని తెలిపారు.

Also read : IPL 2022: సచిన్ కాళ్లు పట్టుకున్న జాంటీ రోడ్స్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మతం ఆధారంగా వివక్ష చూపదని..మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఆర్ఎస్ఎస్ అగ్రనేత కేబీ హెడ్గేవార్ పేరుతో నిర్మించిన ఈ ఆసుపత్రి అన్ని వర్గాల వారికీ చెందినదని చెప్పాను. మతాల ఆధారంగా ఇక్కడ వివక్ష చూపించడం జరగదని తెలిపాను. దాంతోపాటు ఆసుపత్రి గురించి మరికొన్ని విషయాలు కూడా వివరించడంతో రతన్ టాటా ఎంతో సంతోషించారు” అంటూ నితిన్ గడ్కరీ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. గతంలో రతన్ టాటా అడిగిన ప్రశ్న గురించి తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వివరించారు.

ట్రెండింగ్ వార్తలు