Ratan Tata : పియానోపై మనసుపడ్డ రతన్ టాటా.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతికొద్దిమంది పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. ఈయన తన వ్యక్తిగత విషయాలతోపాటు, యువతకు ఉపయోగపడే అంశాలను షేర్ చేస్తుంటారు.

Ratan Tata : పియానోపై మనసుపడ్డ రతన్ టాటా.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Ratan Tata

Updated On : September 8, 2021 / 1:40 PM IST

Ratan Tata : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతికొద్దిమంది పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. ఈయన తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలు.. యువతకు ఉపయోగపడే అంశాలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ తోపాటు ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు రతన్ టాటా. తాజాగా తన వ్యక్తిగత ఇష్టంపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్‌ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.

బడా పారిశ్రామికవేత్త అయినప్పటికీ సాధారణ జీవనం గడిపే రతన్ టాటా.. తను మనసుపడే ఓ కీలక విషయాన్నీ వెల్లడించారు. పియానో వాయిస్తున్న అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు.. చిన్నప్పటి నుంచి తనకు పియానో వాయించడం అంటే ఇష్టమని తెలిపారు. వ్యాపార రంగంలో తీరికలేకపోవడంతో తానూ దీనిపై మనసుపెట్టలేకపోయానని తెలిపారు.

పదవి విరమణ తర్వాత ఖాళీ సమయంతో పాటు పియానో నేర్చుకునేందుకు మంచి టీచర్ దొరికాడు, రెండు చేతులు ఉపయోగించాల్సి రావడంతో దానిపై శ్రద్ద పెట్టలేకపోయామని తెలిపారు. మరోసారి ప్రయత్నించాలని ఆశపడుతున్నట్లు తన పోస్టులో రాశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమ గౌరవం చాటుకుంటున్నారు. లేటు వయసులో కూడా పట్టుదలగా ప్రయత్నిస్తానని చెబుతున్నారు మీరు గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata)