Ravi Shankar Prasad Appoints As Tamil Nadu Governor
Ravi Shankar Prasad as Tamil Nadu governor : తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. రవిశంకర్ ప్రసాద్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే.. తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పురోహిత్ కలిశారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత గవర్నర్ ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.
తమిళనాడుకు కొత్త గవర్నర్‌ను నియమించవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో పురోహిత్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆయనను తప్పించి, రవిశంకర్ ప్రసాద్‌ను కొత్త గవర్నర్‌గా నియమించినట్టు తెెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసిన సీనియర్ మంత్రులు రవిశంకర్ ప్రసాద్ లేదా ప్రకాష్ జవదేకర్ ఇద్దరిలో ఎవరో ఒకరిని తమిళనాడు గవర్నర్ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.