ఎన్నికలకి సిధ్ధం : రాహుల్ తో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతల భేటీ

  • Publish Date - February 5, 2019 / 01:16 PM IST

ఢిల్లీ :  త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో  వ్యూహాలు రూపోందించుకునేందుకు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల  కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. రాహుల్ తో ఏపీ,తెలంగాణ కాంగ్రెస్ నేతలు విడివిడిగా సమావేశం అవుతున్నారు. మొదట ఏపీ  కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం అయ్యారు. అనంతరం తెలంగాణా కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతారు.

తెలంగాణ నుంచి  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కుంతియా,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,విజయశాంతి,తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరు కాగా, ఏపీ నుంచి ఏపీసీసీ ఇంచార్జి ఉమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి,మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కెవిపి రామచంద్రరావు ,సుబ్బిరామిరెడ్డి, జెడి శీలం హజరయ్యారు.  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహంపై  రాహుల్ గాంధీ నేతలతో చర్చిస్తున్నారు.