Red alert : కొత్త సంవత్సరంలో రెడ్ అలర్ట్ జారీ…ఎందుకంటే…

జనవరి 1వతేదీ...కొత్త సంవత్సరంలో భారత వాతావరణశాఖ పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలితో జనవరి 1వతేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సోమవారం ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది....

Dense fog

Red alert : జనవరి 1వతేదీ…కొత్త సంవత్సరంలో భారత వాతావరణశాఖ పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలితో జనవరి 1వతేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సోమవారం ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్, ఫతేఘర్ సాహిబ్, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, జలంధర్, కపుర్తలా, లూథియానా, పఠాన్‌కోట్, పాటియాలా, రూప్‌నగర్, తరన్ తరణ్ జిల్లాల్లో దట్టమైన పొగమంచుతో కూడిన చలి పరిస్థితులు నెలకొన్నాయి.

ALSO READ : Drug Detection Kit : డ్రగ్స్ వాడితే ఇట్టే దొరికిపోతారు

దట్టమైన పొగమంచు, చలి నుంచి అతి శీతల పరిస్థితులపై వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబరు 31, 2023 రాత్రి నుంచి 2024 జనవరి 2వతేదీ ఉదయం వరకు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనున్నాయి. అంబాలా,బికనీర్, పాటియాలా, చండీగఢ్‌లలో దట్టమైన పొగమంచు కమ్ముకున్న పరిస్థితి ఏర్పడింది.

ALSO READ : డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు..! సిక్కోలు వైసీపీలో హైటెన్షన్

రాబోయే రెండు రోజుల్లో మధ్య, వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2-3డిగ్రీల సెల్షియస్ తగ్గుదల ఉండవచ్చునని ఐఎండీ అధికారులు చెప్పారు. బంగాళాఖాతం నుంచి తూర్పుగాలుల కారణంగా జనవరి 1-3వతేదీల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్‌లో తేలికపాటి వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు