పోస్టల్ డిపార్ట్ మెంట్ కీలక నిర్ణయం.. ఇక నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు క్లోజ్.. మీరూ ఓ రిజిస్టర్డ్ పోస్ట్ పంపుతారా.. లాస్ట్ డేట్..

రిజిస్టర్డ్ పోస్ట్‌ను స్పీడ్ పోస్ట్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు. అధికారిక పోస్టల్ డేటా ప్రకారం.. 2011-12 నుంచి ప్రతి సంవత్సరం రిజిస్టర్డ్ పోస్ట్ వినియోగం తగ్గుతోంది.

దేశంలో 19వ శతాబ్దంలో ప్రారంభమైన రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులను ఈ ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి నిలిపివేయాలని తపాలాశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇక స్పీడ్‌ పోస్టు సర్వీసులే అందుతాయి. రిజిస్టర్డ్ పోస్టు, స్పీడ్ పోస్టు సర్వీసులను తపాలాశాఖ చాలాకాలంగా అందుబాటులో ఉంచింది. రిజిస్టర్‌ పోస్టుకు మినిమం ఛార్జి రూ.25, స్పీడ్‌ పోస్టుకు రూ.36. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్‌ను స్పీడ్ పోస్ట్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు.

ముఖ్యమైన డాక్యుమెంట్లు, లేఖలు వంటి వాటిని సురక్షితంగా, ట్రాక్‌ చేయగలిగే విధంగా పంపే అవకాశం రిజిస్టర్డ్ పోస్ట్‌ ద్వారా ఉంటుంది. దీని ద్వారా లేఖ పంపినవారికి పంపిన రశీదు (receipt) అందుతుంది. అందుకున్న వ్యక్తి నుంచి డెలివరీ రుజువు (Acknowledgement) వస్తుంది. పోస్ట్‌ను ట్రాక్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది చట్టపరమైన నోటీసులు, సర్టిఫికెట్లు, అధికారిక సమాచారాన్ని పంపడానికి నమ్మకమైన సర్వీసుగా ఉంది. రిజిస్టర్డ్ పోస్ట్‌ను సెక్యూర్ పోస్ట్ అని పిలిచేవారు.

పాత కాలంలో దీనిని బాగా వాడేవారు. దానితో ఉన్న అనుబంధాన్ని అప్పటివారు గుర్తుచేసుకుంటున్నారు. సునీత గౌర్ (64) కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో స్పీడ్ పోస్టులను వాడుకునేవారు.

Also Read: ఇందుకే భక్తుల కోసం టీటీడీలో ఏఐ టెక్నాలజీ.. దీన్ని వృథా అనడం ఏంటి? ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞతకు వదిలేస్తున్నాం: టీటీడీ ఛైర్మన్

స్పీడ్ పోస్టులు ఇక ఉండవని తెలిసి ఆమె స్పందిస్తూ.. 1979 ఢిల్లీలో తన కాలేజ్ అప్లికేషన్ డాక్యుమెంట్లను జాగ్రత్తగా మానిలా కవర్లలో పెట్టి పంపేదాన్నని అన్నారు. అప్పట్లో సురక్షితంగా చేరుతుందా? సరైన వ్యక్తికి అందుతుందా? అనే విషయానికి గ్యారంటీ ఉన్న ఏకైక మార్గం ఇదేనని తెలిపారు. అంతేగాక, సమాచారాన్ని అందుకున్నట్లు రిసీవ్ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా వచ్చేదని చెప్పారు.

సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్‌ను స్పీడ్ పోస్ట్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు. అధికారిక పోస్టల్ డేటా ప్రకారం.. 2011-12 నుంచి ప్రతి సంవత్సరం రిజిస్టర్డ్ పోస్ట్ వినియోగం తగ్గుతోంది. 2011-12లో 244.4 మిలియన్ నుంచి 2019-20లో 184.6 మిలియన్ కి తగ్గింది. ఇది సుమారు 25 శాతం తగ్గుదల. ఇప్పుడు డిజిటల్ సేవల వినియోగం వేగంగా పెరిగింది.

కొన్ని దశాబ్దాల క్రితం ఢిల్లీకి చెందిన శశి కుమార్ (71)ను వాడిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయస్థానాల్లో రిజిస్టర్డ్ పోస్ట్‌కి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. ‘‘కోర్ట్ కేసుల సమయంలో, నోటీసులు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపితే, అవి చేరినట్లు నిరూపించగలిగే అధికారిక రుజువు ఉండేది’’ అని ఆయన వివరించారు. ఇప్పుడు ఈ పనిని ఈ-మెయిల్ లేదా వాట్సాప్ మెసేజ్‌తో చేస్తున్నారని ఆయన అన్నారు.