రెగ్యులర్ క్వారంటైన్ అవసరం లేదు.. డాక్టర్లను ఖాళీ చేయమన్న ఆస్పత్రులు 

  • Publish Date - May 22, 2020 / 08:00 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆస్పత్రి కరోనా వార్డుల్లోని వైద్యులు, వైద్య సిబ్బందిని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా సూచించింది. మే 21 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా పలు హోటళ్లలో వసతులు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. దీనికి సంబంధించి మే 18న సెక్రటరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ విడుదల చేసిన మార్గదర్శకాల కింద ఆస్పత్రి అధికారిక వర్గాలు ఆదేశాలను జారీ చేశాయి. 

కొవిడ్-19 వార్డుల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బందికి రెగ్యులర్ క్వారంటైన్ అవసరం లేదని, తప్పనిసరిగా ఖాళీ చేయాలని, ధర్మశాలలు, హోటళ్లలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని  LNJP ఆస్పత్రి మే 20న ఒక ప్రకటనలో వెల్లడించింది. అన్ని విభాగాలకు చెందిన వైద్య సిబ్బంది మే 21, 2020 మధ్యాహ్నం 12 గంటల్లోగా హోటళ్లు, ధర్మశాలలకు మారిపోవాలని సూచించింది. 

ఎవరైనా హోటళ్లలో ఉండాల్సిన గడువు కంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే.. దానికి అయ్యే ఖర్చును సొంతంగా వాళ్లే భరించాల్సి ఉంటుందని, ఆస్పత్రి చెల్లించదని ఆదేశాల్లో స్పష్టం చేసింది. మరోవైపు ఆస్పత్రి వైద్యులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఒక లేఖను రాసింది. ఈ లేఖలో డాక్టర్ హార్ష్ వర్దన్ ఆస్పత్రి ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Read: బెంగాల్ లో వివక్ష, జాత్యహంకార వేధింపులు, ఉద్యోగాలు వదిలి మణిపూర్ చేరుకున్న 185మంది నర్సులు