వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన జలియన్ వాలాబాగ్ ఘటనకు శనివారం(ఏప్రిల్-13,32019)నాటికి 101ఏళ్లు. ఈ సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తదితరులు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. అమరవీరుల ధైర్యాన్ని,త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోమని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్-13న పంజాబ్ రాష్ట్రంలోని జలియన్ వాలాబాగ్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న భారతీయులపై జనరల్ డయ్యర్ అత్యంత క్రూరంగా కాల్పులకు ఆదేశించాడు. ఆ కాల్పుల్లో సుమారు వెయ్యి మందికిపైగా మరణించారు. చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
బ్రిటీష్ ఆక్రమణకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో జలియన్ వాలాబాగ్ క్రూర ఘటన ఓ చీకటి అధ్యాయంగా ఉండిపోతుంది. జలియన్ వాలాబాగ్ ఘటన భారత్, బ్రిటీష్ చరిత్రలో మాయని మచ్చ అని గతేడాది బ్రిటీష్ ప్రధాని థెరిసా మే తెలిపారు. 1997లోనూ క్వీన్ ఎలిజబెత్ జలియన్ వాలాబాగ్ ను విజిట్ చేసి నివాళి అర్పించారు. అయితే 101ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు జలియన్ వాలాబాగ్ ఘటనపై బ్రిటన్ అధికారికంగా భారత్ కు క్షమాపణ చెప్పలేదు.(పోలీసుల కోసం మాస్క్ లు కుడుతున్న మాజీ మావోయిస్ట్)