Google Blocked Loan Apps: లోన్ యాప్స్‌ ఔట్ .. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2వేల లోన్ యాప్స్ తొలగింపు.. ఎందుకంటే?

టెక్ దిగ్గజం గూగుల్ నిబంధనలు అతిక్రమించిన లోన్ యాప్స్ పై కొరడా ఝుళిపిస్తోంది. ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్స్ ను తొలగిస్తోంది. ఇలా ఈ యేడాది జనవరి నుంచి జులై నెలాఖరు వరకు 2వేల లోన్ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే వీటిలో ఎక్కువ ..

Loan Apps

Google Blocked Loan Apps: టెక్ దిగ్గజం గూగుల్ నిబంధనలు అతిక్రమించిన లోన్ యాప్స్ పై కొరడా ఝుళిపిస్తోంది. ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్స్ ను తొలగిస్తోంది. ఇలా ఈ యేడాది జనవరి నుంచి జులై నెలాఖరు వరకు 2వేల లోన్ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే వీటిలో ఎక్కువ లోన్ యాప్స్.. సమాచారాన్ని తప్పుగా చూపించడం, పాలసీ ఉల్లంఘనలు, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల భద్రత నిమిత్తం ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.

Online Loan Apps Harassment : వద్దన్నా లోన్ ఇచ్చి వేధింపులు.. శృతి మించుతున్న ఆన్‪లైన్ లోన్ యాప్‌ల అరాచకాలు

యాప్ లు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, మోసాలకు పాల్పడుతున్నాయని ఈ క్రమంలో స్థానిక చట్టం అమలను సంస్థలతో సంప్రదింపుల తర్వాత చర్యలు తీసుకోవటం జరిగిందని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గూగూల్ ఏపీఏసీ (ఆసియా పసిఫిక్ ప్రాంతం) సీనియర్ డైరెక్టర్, ట్రస్ట్ అండ్ సేప్టీ హెడ్ సైకత్ మిత్రా అన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన 2వేల లోన్ యాప్స్ లో 50 శాతానికి పైగా గూగుల్ విధానాలను ఉల్లంఘించినవి అని ఆయన తెలిపారు.

Loan Apps: లోన్ యాప్స్ ఉపయోగించి రూ.500 కోట్ల దోపిడీ.. చైనాకు తరలిస్తున్న ముఠా

ఇదిలాఉంటే త్వరలో అటువంటి యాప్ ల కు వ్యతిరేకంగా విస్తృత రక్షణలను రూపొందించడానికి కంపెనీ తన పాలసీలో కొన్ని మార్పులను తీసుకురావాలని చూస్తోందని సైకత్ మిశ్రా అన్నారు. గూగుల్ ప్రధానంగా వినియోగదారుల భద్రతను ఆధారంగా చేసుకుంటుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు