NCERT 10th Class : పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి ఆవర్తన పట్టిక, ప్రజాస్వామ్యం చాప్టర్లు తొలగింపు

పీరియాడిక్ బేటుల్ గురించి కూడా చాప్టర్ ను తీసేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు.

periodic table democracy chapters : ప్రభుత్వం పంపిణీ చేసే పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలను మార్చేశారు. ఈ మేరకు ఎన్ సీఈఆర్ టీ(NCERT) ఒక ప్రకటన జారీ చేసింది. ఆవర్తన పట్టిక(Periodic table), ప్రజాస్వామ్యం (Democracy) లాంటి చాప్టర్లను పదో తరగతి పాఠ్యాంశం నుంచి తీసివేస్తున్నట్లు ఎన్ సీఈఆర్ టీ తెలిపింది.

రేషనలైజేషన్ లో భాగంగా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో ఆ సిలబస్ ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి పరిణామం సిద్ధాంతాన్ని తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా విడుడలైన ఎన్ సీఈఆర్ టీ పుస్తకాల్లో మరిన్ని చాప్టర్లను తీసేశారు.

Jammu And Kashmir : జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు అరెస్టు

పీరియాడిక్ బేటుల్ గురించి కూడా చాప్టర్ ను తీసేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం సవాళ్లు, రాజకీయ పార్టీలు లాంటి అధ్యాయాలను కొత్త బుక్స్ నుంచి పూర్తిగా తీసేశారు.

ట్రెండింగ్ వార్తలు