2024 election: బీజేపీలో భారీ మార్పులు.. సీఎంలు, కేంద్ర మంత్రులు, నేతలకు కీలక పదవులు

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి పంజాబ్ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. ఇక కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‭ కేరళ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. వినోద్ తాడ్వేకు బిహార్, ఓం మాథుర్‭కు ఛత్తీస్‭గఢ్, బిహార్ మాజీ మంత్రి మంగల్ పాండేకి పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 15 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు నూతన ఇంచార్జీలను నియమించినట్లు శుక్రవారం పార్టీ కార్యాలయం అధికారికంగా పేర్కొంది.

2024 election: 18వ లోక్‭సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అప్పుడే ఎన్నికల కసరత్తులు ప్రారంభించింది. ఇందు కోసం పార్టీలోని కీలక పదవులను ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీలతో నింపేస్తున్నారు. కొత్త పదవులతో వచ్చే ఎన్నికలను మరింత సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ఇందులో భాగంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి పంజాబ్ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. ఇక కేరళ రాష్ట్ర ఇంచార్జీగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ కు‭ బాధ్యతలు అప్పగించారు. వినోద్ తాడ్వేకు బిహార్, ఓం మాథుర్‭కు ఛత్తీస్‭గఢ్, బిహార్ మాజీ మంత్రి మంగల్ పాండేకి పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 15 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు నూతన ఇంచార్జీలను నియమించినట్లు శుక్రవారం పార్టీ కార్యాలయం అధికారికంగా పేర్కొంది.

అంతే కాకుండా నూతన బాధ్యుల జాబితాను ఆ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Supreme Court: నుపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట.. అరెస్ట్ పిటిషన్ తిరస్కరణ

ట్రెండింగ్ వార్తలు