Ip India Jobs
Ip India : భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియాలో ఒప్పంద ప్రాతిపదికన హియరింగ్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. టీఎంఆర్ ముంబై-8, టీఎంఆర్ ఢిల్లీ-8, టీఎంఆర్ చెన్నై-5, టీఎంఆర్ అహ్మదాబాద్-5, టీఎంఆర్ కోల్‌కతా-4 ఉన్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. జీతభత్యాలకు గాను నెలకు రూ.90,000 చెల్లిస్తారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక నిర్వహిస్తారు. దరఖాస్తును ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 20గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ipindia.gov.in/index.htmlసంప్రదించగలరు.