Hindenburg Report On ADANI Group : అదానీ గ్రూప్స్ సంక్షోభంపై స్పందించిన మాయావతి.. పార్లమెంటులో ప్రకటన కావాలని డిమాండ్

Hindenburg Report On ADANI Group : గత రెండు రోజులుగా గణతంత్ర దినోత్సవం కంటే అదానీ ఇండస్ట్రీ గ్రూప్‌కు సంబంధించి అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన ప్రతికూల నివేదిక మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ రిపోర్టుతో స్టాక్ మార్కెట్‌పై దుష్ప్రభావం పడిందని అంటున్నారు.

Hindenburg Report On ADANI Group : హిండెన్‌బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క రిపోర్టు అదానీ వ్యాపార సామ్రాజ్యంలోని పునాదుల్ని కదిలించింది. ఇప్పటికే లక్షల కోట్లు నష్టపోయిన అదానీ, మరింత నష్టపోయే ప్రమాదం లేకపోలేదు అని వ్యాపార విశ్లేషకులు అంటున్నారు. రెండు రోజులుగా దేశంతో పాటు ప్రపంచాన్ని సైతం తల తిప్పుకోనివ్వకుండా చేస్తున్న ఈ విషయంపై బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. గత రెండు రోజులుగా గణతంత్ర వేడుకల కంటే కూడా అదానీ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోందని, అయినప్పటికీ దీనిపై ప్రభుత్వం మౌనంగా ఉందని ఉందని మండిపడ్డారు.

Bharat Jodo Yatra: కాశ్మీర్‌లో స్వచ్చమైన గాలిలా రాహుల్ యాత్ర.. భారత్ జోడోయాత్రలో మెహబూబా ముఫ్తీ..

శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా మాయావతి స్పందిస్తూ ‘‘గత రెండు రోజులుగా గణతంత్ర దినోత్సవం కంటే అదానీ ఇండస్ట్రీ గ్రూప్‌కు సంబంధించి అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన ప్రతికూల నివేదిక మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ రిపోర్టుతో స్టాక్ మార్కెట్‌పై దుష్ప్రభావం పడిందని అంటున్నారు. దేశంలోని కోట్లాది ప్రజల కష్టార్జిత సొమ్ము దానితో ముడిపడి ఉంది. కానీ ప్రభుత్వం మౌనంగా ఉంది. షేర్లలో మోసం చేశారన్న ఆరోపణలతో అదానీ ఆస్తులు 22.6 బిలియన్ డాలర్ల మేర పడిపోయి, ప్రపంచ ర్యాంకు పడిపోవడంతో, గ్రూప్‌లో ప్రభుత్వం పెట్టిన భారీ పెట్టుబడి ఏమవుతుందోనని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఏమి జరుగుతుంది? అశాంతి, ఆందోళనతో ఉన్న సహజానికి పరిష్కారం కావాలి. జనవరి 31 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల్లో అశాంతి, నిరాశను పెంచిన అదానీ గ్రూప్ అంశంపై ఉభయ సభలలో ఒక వివరణాత్మక ప్రకటన చేయాలి’’ అని వరుస ట్వీట్లు చేశారు.

Ramcharitmanas Remark Row: మౌర్య తల తీసేయాలంటూ అయోధ్య సాధువు సంచలన వ్యాఖ్యలు.. ఉగ్రవాదులంటూ మౌర్య ప్రతిదాడి

హిండన్‭‭బర్గ్ రిపోర్టుతో అదానీ ఆస్తులు ఐస్‭బర్గ్‭లా కరిగిపోతున్నారు. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు (20 బిలియన్ డాలర్లు) పైగా నష్టపోయిన అదానీ తాజాగా మరింత పెద్ద నష్టాన్ని చవిచూశారు. శుక్రవారం నాటి ట్రేడింగు ప్రకారం కేవలం 6 గంటల్లోనే 1.60 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరైపోయింది. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో లాస్ రావడం అదానీ వ్యాపార జీవితంలో ఇదే మొదటిసారి అని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం.. అదానీ ఆస్తుల విలువ 92.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Tripura Assembly Elections: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ, కాంగ్రెస్ ..

అపర కుబేరుడు అదానీకి చెందిన కంపెనీలన్ని అప్పుల కుప్పల్లా మారాయని అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్ ఇచ్చింది. ప్రమోటర్ల మార్కెట్ మ్యాజిక్‌తో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్ల ధరలకు రెక్కలొచ్చి చుక్కల దాకా చేరాయ్. అవి ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని, వాటిలో పెట్టుబడులు ఎంతమాత్రం మంచిది కాదని ఈ రిపోర్ట్ క్లారిటీ ఇచ్చేసింది. అంతే, ఇక అదానీ కంపెనీల షేర్లన్నీ పాతాళానికి పడిపోవడం ప్రారంభించాయి. ఇప్పటికే లక్షల కోట్లు లాసైన అదానీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీలు మరింత నష్టాన్ని చవిచూడబోతున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు