Restricted Registrations at AIIMS OPD
AIIMS: దేశ రాజధాని ఢిల్లీలో AIIMSలోకి సాధారణ రోగులను అనుమతించకుంగా నిషేధం విధించింది. దీనితో పాటు, అవసరం లేని ఆపరేషన్‌లను కూడా పోస్ట్‌పోన్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
ఒమిక్రాన్, కరోనా ముప్పు మధ్య రాజధానిలో ప్రబలిన కరోనా కేసుల విషయంలో అప్రమత్తమైన AIIMS ఈమేరకు నిర్ణయం తీసుకుంది. AIIMS విడుదల చేసిన ఒక ప్రకటనలో, AIIMSలో OPD సేవలు కొత్తవి పరిమిత సంఖ్యలో మాత్రమే నమోదు చేయనున్నట్లు చెప్పారు.
స్పెషాలిటీ క్లినిక్‌లు ప్రస్తుతానికి మూసివేయగా.. ఫాలోఅప్ రోగులు ఫాలో-అప్ అపాయింట్‌మెంట్ స్లాట్‌లలో మాత్రమే చూపించుకోవలసి ఉంటుంది. రొటీన్ పేషెంట్ రిక్రూట్‌మెంట్.. అనవసరమైన సర్జరీలు కొంతకాలం పాటు నిలిపివేయబడతాయని AIIMS ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది AIIMS.
ఢిల్లీలో జనవరి 7వ తేదీన మొత్తం 17 వేల కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. అంతకుముందు జనవరి 6న ఢిల్లీలో 15 వేల కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ ఆరోగ్యమంత్రి కూడా కరోనా పాజిటివిటీ రేటు ఎంత వేగంగా పెరుగుతోందో వెల్లడించారు. పాజిటివిటీ రేటు నిన్నటి కంటే 1-2% ఎక్కువగా ఉందని చెప్పారు. నిన్న (జనవరి 6) పాజిటివిట రేటు 15శాతం ఉంది. ఇది ఇప్పుడు జనవరి 7న 17-18%గా ఉండవచ్చునని జైన్ చెప్పారు.
ఒమిక్రాన్ వేవ్ దృష్ట్యా విధించిన ఆంక్షలు అవసరమని, ముందుగా చర్యలు తీసుకుంటే కరోనాను అడ్డకోవచ్చనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.