‘Reverse Gear Auto Race’ : మహారాష్ట్రలో ‘రివర్స్ గేర్ ఆటో రేస్’..చూస్తే మామూలుగా లేదుగా..

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఆటో రేస్ అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ఆటో రేస్ అంటే అలాంటిలాంటి రేస్ కాదది. రోమాలు నిక్కబొడుకునే రేస్.

‘Reverse Gear Auto Race’ : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఆటో రేస్ అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ఆటో రేస్ అంటే అలాంటిలాంటి రేస్ కాదది. రోమాలు నిక్కబొడుకునే రేస్. మహారాష్ట్రలోని సంగమేశ్వర్ యాత్ర సందర్భంగా.. సాంగ్లీ నగరానికి సమీపంలోని హరిపూర్ గ్రామంలో రివర్స్ ఆటో రిక్షా అంటే ‘రివర్స్ ఆటో రిక్షా డ్రైవింగ్ పోటీ’లు జరిగాయి. రివర్స్ లో కూడా ఆటోను అతి వేగంగా నడిపించవచ్చని ఈరేస్ ను చూస్తే తెలుస్తుంది. రివర్స్ గేర్ లో ఆటోలను అత్యంత వేగంగా నడిపే డ్రైవర్లను ఈలలు వేసి ఉత్సాహపరిచారు వీక్షకులు.

ఈ వింత ఆటో పోటీలకు కూడా చక్కగా కామెంటరీ చెబుతు రక్తి కట్టించారు. ఈ రివర్స్ గేర్ ఆటో రేస్ చూడటానికి చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ రివర్స్ గేర్ ఆటో రేస్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ వింత ఆటో రేస్ లపై..

 

ట్రెండింగ్ వార్తలు