Rezaul Haque Congress Candidate From Samsherganj Dies Of Covid 19
Rezaul Haque వెస్ట్ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 5,892 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, కరోనా బారిన పడిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గురువారం ప్రాణాలు కోల్పోయారు.
ముర్షిదాబాద్ జిల్లాలోని సమ్సేర్‌గంజ్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన రిజావుల్ హక్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన రిజావుల్ హక్ కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఇంకా నాలుగు దశల పోలింగ్ జరగాల్సివుంది. సమ్సేర్‌గంజ్ నియోజవర్గానికి ఏప్రిల్-17న పోలింగ్ జరగనుంది.