Ram Nath Kovind: సభలో చర్చల సమయంలో గాంధేయవాదాన్ని అనుసరించాలి.. వీడ్కోలు సభలో కోవింద్

శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు.

Ramnath Kovind

Ram Nath Kovind: రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు పలు సూచనలు చేశారు.

Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్

జాతీయ ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగాలని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఏది అవసరమో నిర్ణయించుకొని ముందుకు సాగాలని కోరారు. పార్లమెంటును “ప్రజాస్వామ్య దేవాలయం” అని పేర్కొన్న రాష్ట్రపతి కోవింద్.. సభలో చర్చల సమయంలో గాంధేయ తత్వాన్ని పాటించాలని పార్టీలను కోరారు. పార్లమెంటులో చర్చ, అసమ్మతి హక్కులను వినియోగించుకునేటప్పుడు ఎంపీలు ఎల్లప్పుడూ గాంధీ తత్వాన్ని అనుసరించాలని అన్నారు.

Droupadi Murmu: 25న ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ స్వీకారం.. ఆ రోజు కార్య‌క్ర‌మాల షెడ్యూల్ ఇలా..

15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించే ద్రౌపది ముర్ముకు రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మార్గదర్శకత్వంలో దేశం ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్ నాథ్ కోవింద్ రేపు పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ద్రౌపదీ ముర్ము 25న దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ము విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించారు.