Gold Price Today : భారీగా పెరిగిన బంగారం ధరలు.. మూడు నెలల గరిష్ఠానికి జంప్

బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. వరుసగా రెండోరోజు ధర పసిడి ధర ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ. 45,100కి చేరింది.

Dhanteras Gold Prices Huge Hike

Gold Price Today : బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. వరుసగా రెండోరోజు ధర పసిడి ధర ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ. 45,100కి చేరింది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.440 పెరిగి రూ.49,200లకు చేరింది. ఇక బంగారం ధరలు హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకేలా ఉన్నాయి.

చదవండి : Gold Prices Today : తగ్గిన బంగారం ధరలు

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,410గా ఉంది. ముంబైలో 46,220, న్యూఢిల్లీలో 47,250, కోల్‌కతాలో 47,500, బెంగళూరులో 45,100, కేరళలో 45,100గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం ధర చెన్నైలో రూ.49,540 పలుకుతోంది. ముంబైలో 47,220, న్యూఢిల్లీలో 51,550, కోల్‌కతాలో రూ.50,200, బెంగళూరులో 49,200, కేరళలో 49,200కి లభిస్తోంది.

చదవండి : Gold Price: భారీగా పెరిగిన వెండి ధర.. అదే దారిలో బంగారం!

ఇక బంగారం రేటు ఈ విధంగా పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.