Rising Temperatures : దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఢిల్లీ ఎన్సీఆర్ లో హీట్ వేవ్ హెచ్చరిక

ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సోమవారం అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.

Rising Temperatures

Delhi NCR Heat Wave : దేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం ఐఎండీ ఢిల్లీ ఎన్సీఆర్ లో హీట్ వేవ్ హెచ్చరిక చేసింది. అధికంగా ఎండ, వేడి గాలుల ప్రభావం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎన్సీఆర్ లోని 18 జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సోమవారం అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఆదివారం నజఫ్ఘడ్ లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Delhi : ఢిల్లీని కమ్మేసిన దుమ్ము, ధూళి.. భారీగా పెరిగిన వాయు కాలుష్యం

ఢిల్లీ, పశ్చిమ రాజస్థాన్, దక్షిణ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌లోనూ వేడిగాలుల ప్రభావం ఉన్నది. రానున్న మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్‌లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.