Karnataka Elections 2023: కర్ణాటకలో ఎన్నికల హడావుడి.. కాంగ్రెస్ కార్యాలయం ముందు రచ్చ రచ్చ

కర్ణాటకలో తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతలు ధర్నాలకు దిగుతున్నారు.

Karnataka Elections 2023

Karnataka Elections 2023: కర్ణాటకలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. వచ్చే నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉన్న నేపథ్యంలో టికెట్లు ఆశిస్తున్న వివిధ పార్టీల నేతలు పార్టీ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. టికెట్ దక్కకపోతే రచ్చ రచ్చ చేశారు. తాజాగా, బెంళూరులోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది.

పలు నియోజక వర్గాలకు చెందిన నేతలు, వారి మద్దతుదారులు అక్కడకు వచ్చారు. టికెట్ అడుగుతూ ఎవరికి వారు అక్కడే ధర్నాలకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ వచ్చారు. ఆయనను ముందుకు వెళ్లనివ్వకుండా పలువురు నేతలు, కార్యకర్తలు చుట్టుముట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది.

కొన్ని రోజుల్లో రెండో జాబితా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తమకు టిక్కెట్ ఇవ్వాలంటూ చాలా మంది నేతలు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం అహ్మద్ అన్నారు. అందుకే చాలా మంది కాంగ్రెస్ నుంచి టికెట్లను డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం వచ్చే మంగళవారం జరుగుతుందని తెలిపారు.

Kapil Sibal: అల్లర్లే లేకుంటే ఆ నంబర్లేంటి? అమిత్ షా వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ఫైర్