Lalu prasad Yadav PM Modi
Lalu Prasad Yadav- PM Modi Surya lokam : చంద్రయాన్ -3 సక్సెస్ కావటంతో ఇస్రో తాజాగా సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. సూర్యునిపై పరిశోధనల కోసం ఇస్రో ఆదిత్య ఎల్-1 (Aditya L-1) ప్రయోగాన్ని చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం ఆదిత్య ఎల్-1 నింగిలోకి దూసుకుపోయింది. వరుస విజయాలతో దూసుకున్న ఇస్రోపై బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ (RJD leader Lalu prasad) ప్రసంశలు కురిపించారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)కు ఓ వినూత్న విజ్ఞప్తి చేశారు లాలూ. నరేంద్ర మోదీని ‘సూర్యలోకం’ (PM Modi Surya lokam) పంపే ఏర్పాట్లు చేయాలి అంటూ అభ్యర్థించారు. ముంబైలో ఇండియా కూటమి సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమిలో విబేధాలు ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని ఇండియా కూటమిలో ఎటువంటి పొరపొచ్చాలు లేవు అంటూ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో ఎటువంటి సమస్యలు లేవని తేల్చి చెప్పారు. కూటమిని మరింత బలోపేతం చేసి మోదీని గద్దెదించి దేశాన్ని కాపాడటానికి ఇండియా కూటమి కృషి చేస్తోందని ధీమా వ్యక్తంచేశారు. ‘బిజెపి హటావో, దేశ్ బచావో (బీజీపిని తొలగించండీ.. దేశాన్ని రక్షించండి)’ అనే నినాదంతో పనిచేస్తున్నామన్నారు.
దేశంలో కీలక పార్టీలన్నీ కలిసి పనిచేయటం.. కూటమిగా ఏర్పడటం జీర్ణించుకోలేని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది అంటూ ఆరోపించారు. అందరం ఒకే తాటిపైకి రావడంతో బీజేపీ భరించలేక ఇండియా కూటమిలో విభేధాలు ఉన్నాయంటూ మైండ్ గేమ్ ఆడుతోందంటూ మండిపడ్డారు. దేశంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు లాలూ. దేశంలో ప్రజలకు రక్షణ లేకపోవటమే కాదు మోదీ పాలనలో పేదరికం కూడా పెరిగిపోతోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయని దీని గురించి బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా అధికారంలో ఉండటంపైనే ఫోకస్ పెట్టిందని ధ్వజమెత్తారు.
మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ అబద్దాలు చెప్పటం, పుకార్లను లేవదీయటంలో దిట్ట అంటూ ఆరోపించారు. పుకార్లు ప్రచారం చేయడం ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని, కలిసి కట్టుగా పనిచేసేవారిపై బురద జల్లుతూ బీజేపీ తన సహజధోరణిని కంటిన్యూ చేస్తోంది అంటూ మండిపడ్డారు. స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన మోదీ ఇప్పుడు ఆ మాటే ఎత్తటం లేదంటూ విమర్శించారు. స్విస్ బ్యాంకులో ఉన్న బ్లాక్ మనీని తెచ్చి దేశంలో ప్రతీ ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ ఇప్పుడేం చేస్తున్నారు..? మోదీ మాటలు నమ్మి ఎంతోమంది ఖాతాలు తెరిచారని.. అలాగే తాను కూడా ఓ ఖాతాను తెరిచాను కానీ ఒక్క రూపాయి కూడా పడలేదే అంటూ ఎద్దేవా చేశారు.
Viral Video : QR కోడ్‌తో క్రియేటివ్‌గా కూరగాయలు అమ్ముతున్న మహిళా వ్యాపారి
మోదీ మాటలు నమ్మినవారికి ఒరిగింది ఏమీలేదని.. తన ఇంట్లో 11 మంది ఉన్నారని.. దీంతో అందరికి ఖాతాల్లోను డబ్బులు పడితే మంచి ఎమౌంట్ అవుతుందని ఆశించాను కానీ అటువంటిదేమీ జగరలే అంటూ లాలూ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాలపై ప్రశంసలు కురిపించారు. ఇస్రో శాస్త్రవేత్తలు గొప్పగొప్ప విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించిన లాలూ ప్రసాద్.. మోదీనికి సూర్యలోకానికి పంపే ఏర్పాట్లు చేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు. మోదీపై తాను జీవించి ఉన్నంత వరకు పోరాడుతునే ఉంటానన్నారు.