×
Ad

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొని ఆరుగురు మృతి..

Road Accident :ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు..

Road accident in Tamil Nadu

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లా కడయనల్లూరు వద్ద రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. 35మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

ఒక బస్సు మధురై నుండి తెన్‌కాశీ వైపు వెళ్తుండగా.. మరొక బస్సు కడైయనల్లూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని చెప్పారు. ప్రమాదంకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా ఇన్చార్జ్ మంత్రి కెకెఎస్‌ఎస్ఆర్ రామచంద్రన్‌కు ఫోన్ చేసి ఘటన స్థలికి వెళ్లాలని సూచించారు. ప్రమాద స్థలంలో ఉన్న కలెక్టర్ తో తాను మాట్లాడానని, గాయపడిన ప్రయాణికులందరికీ మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు.