Robert Vadra Tests Covid Positive Priyanka Gandhi Goes Into Isolation
Robert Vadra కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా వైరస్ సోకింది. తాజాగా ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ప్రియాంకాగాంధీ వాద్రా కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వాద్రాతోపాటు ఆమె కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండిపోయారు.
తనకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ కొద్ది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని డాక్టర్లు సూచించినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ సెల్ఫీ వీడియోలో ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలో అసోం, తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
కొద్ది రోజులగా ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికలున్న అస్సాం, కేరళ రాష్ట్రాలలో చురుకుగా ప్రచారం చేస్తున్నారు. తమిళనాడులోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ఇప్పటివరకు అస్సాంలో రెండుసార్లు పర్యటించగా.. మూడోసారి ఇవాళ పర్యటించాల్సి ఉంది. ఇంతలో కరోనా విషయం తెలియడంతో ప్రియాంక గాంధీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగే ర్యాలీలలో కూడా ఆమె ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ, ఆ పర్యటన కూడా రద్దు అవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి.
हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021