హవాలా మార్గంలో భారత్‌ నుంచి చైనాకు రూ.50 వేల కోట్లు.. ఏం జరిగిందో తెలుసా?

ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈడీతో దర్యాప్తు చేస్తోంది.

Enforcement Directorate

చైనాకు పలు భారతీయ కంపెనీలు రూ.50 వేల కోట్లను హవాలా మార్గం ద్వారా తరలించాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ కంపెనీలు అన్నీ చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే సంస్థలే.

ఆ కంపెనీలపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. పలు భారతీయ సంస్థలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన ఫర్నిచర్, గాడ్జెట్‌ల వంటి లగ్జరీ ఉత్పత్తులను తక్కువ ఇన్‌వాయిస్ చేస్తున్నాయని ఈడీ వర్గాలు అంటున్నాయి.

ఇది భారతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి. దీనిపై ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈడీతో దర్యాప్తు చేస్తోంది.

పన్నులు ఎగ్గొట్టొచ్చన్న వ్యూహంతో అండర్ ఇన్‌వాయిస్ విధానం ద్వారా గత ఆరు నెలల్లోనే భారతీయ కంపెనీలు చైనా వ్యాపారులకు రూ.50 వేల కోట్లను పంపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ భారతీయ కంపెనీలు నగదు అక్రమ చలామణీ నిరోధక, విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించినట్లు భావిస్తున్నారు.

చైనా వ్యాపారులతో జరిపిన లావాదేవీలలో క్రిప్టోకరెన్సీల వినియోగంపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. డిజిటల్ కరెన్సీల ద్వారానే చెల్లింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Vinesh Phogat : హరియాణా ఎన్నికల్లో వినేష్ ఫోగట్ విజయం