నవీన్ పట్నాయక్…ధనవంతుల లిస్ట్ లో నెం.1

ఒడిషా మంత్రి మండలిలో అత్యంత సంపన్నుడు సీఎం నవీన్ పట్నాయక్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం(ఫిబ్రవరి-12,2020)ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తమ వెబ్ సెట్ ద్వారా నవీన్ పట్నాయక్ తో కలిపి 20మంది మంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది.

ఈ లిస్ట్ లో 64.26కోట్లకు పైగా ఆస్తులతో సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ఈ లిస్ట్ లో కేవలం 26లక్షల రూపాయల విలువైన ఆస్తులతో క్రీడా,ఐటీ శాఖ మంత్రి తుషార్ కంటి బెహెరా పేద మంత్రిగా నిలిచాడు.

గతేడాది ఒడిషా ఎన్నికల సమయంలో నవీన్ పట్నాయక్ ఇచ్చిన డిక్లరేషన్ లో మార్చి 31,2019నాటికి ఆయన సొంత ఆస్తుల విలువ 64.26కోట్లు. 62లక్షల 66వేల 663రూపాయల విలువైన చరాస్థులు,63కోట్ల 64లక్షల 15వేల 261 రూపాయల స్థిరాస్తులు ఇందులో ఉన్నాయి.