Manipur: మొన్నటి వరకు రూ.2,500కు వచ్చిన టికెట్ ఇప్పుడు రూ.25 వేలు

Manipur: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇంఫాల్ నుంచి కోల్‌కతాకు విమాన వన్ వే టికెట్ ఛార్జి రూ.12,000- రూ.25,000 మధ్య ఉంది.

Manipur

Manipur: మణిపూర్‌(Manipur) లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ప్రజలు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడానికి భారీగా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. రద్దీ పెరగడంతో ఇండిగో (IndiGo), ఎయిర్‌ఏషియా (AirAsia) విమానయాన సంస్థలు విమానాల టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి.

సాధారణంగా ఇంఫాల్-కోల్‌కతా మధ్య వన్ వేలో (615 కిలోమీటర్లు) ఒక్కరు ప్రయాణించడానికి రూ.2,500-రూ.5,000 మధ్య టికెట్ ధర ఉంటుంది. ఇంఫాల్ నుంచి గువాహటికి (269 కిలోమీటర్లు) కూడా ఇదే రేటు. కొన్ని రోజుల నుంచి మణిపూర్ లో హింస చొోటుచేసుకుంటుండడంతో.. అక్కడ నివసిస్తోన్న ఇతర రాష్ట్ర ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు.

ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వారిని వెనక్కి రప్పిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇంఫాల్ నుంచి కోల్‌కతాకు విమాన వన్ వే టికెట్ ఛార్జి రూ.12,000- రూ.25,000 మధ్య ఉంది. అలాగే, ఇంఫాల్ నుంచి గువాహటి టికెట్ ధర రూ.15,000కు పెరిగింది. ప్రస్తుత పరిస్థితే కాదు మరో నాలుగు రోజుల పాటు ఇదే స్థాయిలో టికెట్ ధరలు ఉన్నాయి.

మేక్ మై ట్రిప్ (MakeMyTrip) వెబ్ సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం… మే 12 వరకు ఇంఫాల్-కోల్‌కతా, ఇంఫాల్-గువాహటి టికెట్ ధరలు రూ.10,000-రూ.15,000 మధ్యే ఉన్నాయి. మే 3న కుకి గిరిజనులు నిరసనకు దిగిన సమయంలో, గిరిజనేతర మెయిటీ కమ్యూనిటీ వారితో ఘర్షణలు జరిగాయి. అప్పటి నుంచి కర్ఫ్యూ కొనసాగుతోంది.

Manipur Telugu People : మణిపూర్ లో బిక్కుబిక్కుమంటున్న తెలుగు ప్రజలు.. తీసుకొచ్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు