Russia offers oxygen, Remdesivir కరోనా వేళ.. కష్టంలో తోడుగా.. భారత్‌కు రష్యా సాయం

Oxygen, Remdesivir Antiviral Drug: దేశ రాజధాని ఢిల్లీతో సహా.. పలు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆక్సిజన్ కొరత విపరీతంగా ఉంది. ఈ సమయంలో భారత్‌కు సాయం చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది. కష్టంలో తోడుగా.. ఆదుకునేందుకు అంగీకరించింది. ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోగా.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక ఊపిరి అందక ఎంతోమంది చనిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో రష్యా చేస్తున్న సాయం చాలా గొప్పది.

ఆక్సిజన్ కోసం ఎదురుచూసి సకాలంలో అందక ఎంతోమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా.. ఐసీయూ బెడ్‌లు 99 శాతం నిండిపోయాయి. అంతేకాదు.. కరోనాపై పోరాడే రెమ్‌డిసివర్ మందులు కూడా దొరకట్లేదు. ఈ క్రమంలోనే రష్యా.. కరోనా ఇంజెక్షన్లను, ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తామని కీలక ప్రకటన చేసింది.

స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చెయ్యాలి. భారత్‌కు రష్యా మంచి మిత్రులు.. అందుకే మెడికల్ ఆక్సిజన్, రెమిడిసివిర్‌లను అలాగే స్పూత్రిక్ వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తామని ప్రకటించింది. వచ్చే 15రోజుల్లో వీటి దిగుమతులు ప్రారంభం కానున్నాయి. కష్టకాలంలో భారత్‌కు ఇది ఊరట కలిగించే అంశమే.

వారానికి మూడు నుంచి నాలుగు లక్షల రెమ్‌డిసివర్ ఇంజిక్షన్లను సరఫరా చేయగలని మాస్కో ప్రకటించింది. వీటి సంఖ్య మరింత పెరగొచ్చని, నౌకల ద్వారా ఆక్సిజన్ సిలిండర్ల దిగుమతికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రష్యా ప్రకటించింది

ట్రెండింగ్ వార్తలు