Russia-Ukraine War : 219 మంది భారతీయులతో యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న తొలి విమానం..

యుక్రెయిన్ 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటి క్రితమే ముంబై చేరుకుంది.

Russia Ukraine War First Flight Carrying 219 Indians Takes Off From Romania, Reached To Mumbai

Russia-Ukraine War : యుక్రెయిన్ 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటి క్రితమే ముంబై చేరుకుంది. రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి తొలి విమానం బయల్దేరింది. ముంబైలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమానంలో 219 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలంచేందుకు రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. యుక్రెయిన్ లో నెలకొన్న భయానక పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న వందలాది మంది భారతీయులు భయాందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడూ స్వస్థలాలకు సేఫ్‌గా తిరిగి వెళ్తామా అని బిక్కుబిక్కుమంటూ గడిపేశారు. ఎయిరిండియా విమానంలో యుక్రెయిన్‌లోని బుకారెస్ట్ నుంచి తిరిగి స్వదేశానికి తిరిగి చేరుకోవడంతో 219 భారతీయులు ఊపిరిపీల్చుకున్నారు.

Russia Ukraine War First Flight Carrying 219 Indians Takes Off From Romania, Reached To Mumbai

యక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో యుక్రెయిన్‌లో చిక్కుకున్న తమ దేశీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. భారత్ సైతం యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలను చేపట్టింది. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబీసీతో కలిసి ఏర్పాటు చేసింది. ఇప్పటికే యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైంది. రొమేనియా బుకారెస్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా (AI 1944 ) విమానంలో 219 మంది భారతీయులతో ఈ రాత్రి 8 గంటల సమయంలో ముంబైలో ల్యాండ్ అయింది. భారతీయుల తరలింపును కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భారత విదేశాంగ బృందాలు, 24 గంటలూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి.

ఆదివారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజామున 2:30 గంటలకు మరో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకోనుంది. ఒక్కో విమానంలో 235 నుంచి 240 మంది విద్యార్థులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇండియాకు రానున్న విద్యార్థుల్లో ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉన్నారు. విద్యార్థులంతా బస్సుల్లో బుకారెస్టు విమానాశ్రయం చేరుకోవడం ఆలస్యం అవుతోంది. దీని కారణంగానే ముంబై, ఢిల్లీ, నుంచి విమానాలు ఆలస్యంగా వెళ్లాయని విమానయాన వర్గాలు వెల్లడించాయి.

Read Also : Indian Students : యుక్రెయిన్ నుంచి మొదలైన భారతీయుల తరలింపు.. ఈ రాత్రికి ముంబైకి చేరుకోనున్న విమానం