డిసెంబర్ 26న శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత  

  • Publish Date - November 25, 2019 / 01:42 AM IST

దేశంలో ప్రస్తుతం నల్లని వస్త్రధారణతో అయ్యప్ప భక్తుల శరణుఘోషతో గుళ్లు మార్మోగిపోతున్నాయి. అక్టోబరు నెల నుంచే భక్తులు స్వామి దీక్ష తీసుకుని  పూజలు చేస్తూ ఉంటారు.   కేరళలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని మండలమకరవిళక్కు సందర్భంగా  నవంబర్ 17న తెరిచి భక్తులకు  దర్శనం కల్పిస్తున్నారు. స్వామి దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువయ్యింది.  

కాగా.. డిసెంబర్ 26 న ఏర్పడే  సూర్య గ్రహాణం సందర్భంగా  స్వామి వారి ఆలయాన్ని 4 గంటలపాటు మూసి వేస్తున్నట్లు ట్రావెన్ కోర్  దేవస్వం బోర్డు తెలిపింది. డిసెంబర్ 26 గురువారం ఉదయం గం.7-30 నిమిషాల నుంచి గం.11-30 నిమిషాల వరకు ఆలయాన్ని మూసి ఉంచుతారు. డిసెంబర్ 26న సూర్యగ్రహణం  ఉదయం గం.08.06లకు ప్రారంభమై గం.11.30  నిమిషాలకు ముగుస్తుంది.

 ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో నెయ్యాభిషేకంతో సాహా ఏ పూజలు నిర్వహించరు.  గ్రహణం అనంతరం ఆలయాన్ని తెరిచి పుణ్యవహాచనాన్ని చేసిన తర్వాత పూజలు జరుపుతారు.  కొండపైన అయ్యప్ప ఆలయంతో పాటు.. మాలికాపురం, పంబలో ఉన్న ఇతర ఆలయాల్ని కూడా సూర్యగ్రహణం  కారణంగా మూసి వుంచనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.