×
Ad

Sabarimala Gold : శబరిమల బంగారు తాపడాల వివాదంలో ట్విస్ట్.. 400 గ్రాముల బంగారం కడ్డీలు గుర్తింపు.. నిందితుడి ఇంట్లో గోల్డ్ కాయిన్స్ 2లక్షల నగదు సీజ్

Sabarimala Gold : శబరిమల ఆలయ బంగారం దొంగతనం కేసులో సిట్ అధికారులు పురోగతిని సాధించారు. కర్ణాటకలోని బళ్లారిలో గల ఒక జ్యువెలరీ షాపు నుంచి..

Sabarimala Gold : శబరిమల ఆలయ బంగారం దొంగతనం కేసులో సిట్ అధికారులు పురోగతిని సాధించారు. కర్ణాటకలోని బళ్లారిలో గల ఒక జ్యువెలరీ షాపు నుంచి సుమారు 400 గ్రాముల బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం బళ్లారిలో స్వాధీనం చేసుకున్న బంగారం శబరిమల ఆలయ పనుల కోసం తీసుకొచ్చిందేనా.. కాదా అనే అంశాన్ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.

శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతులు నిమిత్తం తొలగించారు. వాటిని సరి చేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని పారిశ్రామిక వేత్త ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లాడు. ఈ పనిని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది. అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40రోజుల తరువాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది.

Also Read : Telangana : కొడుకు నిశ్చితార్ధం.. రెండు విమానాల్లో 500 మందిని గోవా తీసుకెళ్లిన తండ్రి.. ఆశ్చర్యపోయిన ఎయిర్‌పోర్టు సిబ్బంది

బంగారం తాపడం బరువు తగ్గడంపై కేరళ హైకోర్టులో ఇటీవల విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను కోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఈ వివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసింది. నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటకలోని బళ్లారిలో గల ఒక జ్యువెలరీ షాపు నుంచి సుమారు 400 గ్రాముల బంగారం కడ్డీలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పోట్టి తన సహచరుడు, గోల్డ్ షాపు ఓనర్ గోవర్ధన్ కు అప్పగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, తిరువనంతపురంలోని పులిమత్ ప్రాంతంలో ఉన్న ఉన్నికృష్ణన్ పోట్టి ఇంటిలో సోదాలు చేసిన సిట్ అధికారులు కొన్ని బంగారు నాణేలతోపాటు రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉన్ని కృష్ణన్ కస్టడీని కోర్టు అక్టోబర్ 30 వరకు పొడిగించింది. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. అందులో భాగంగా దర్యా ప్తు బృందాలు బెంగళూరు, బళ్లారి, హైదరాబాద్, చెన్నై నగరాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి.

బెంగళూరులోని ఉన్నికృష్ణన్ నివాసం, బళ్లారిలో బంగారం అమ్మిన షాపు, హైదరాబాద్లో ఆలయ గర్భగుడి తలుపు ప్యానెల్స్‌కు మరమ్మతులు చేసిన సంస్థ, చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ (గోల్డ్ ప్లేటింగ్ సరఫరాదారులు) లోనూ సోదాలు చేశారు. ప్రస్తుతం బళ్లారిలో స్వాధీనం చేసుకున్న బంగారం శబరిమల ఆలయ పనుల కోసం తీసుకొచ్చిందేనా కాదా అనే అంశాన్ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. గోవర్ధన్ గతంలో ఆలయ గర్భగుడి ప్యానెల్స్ బంగారు పూత పనులకు గోల్డ్ సరఫరా చేసిన వ్యక్తికావడంతో అతడిపైనా విచారణ కొనసాగుతోంది. ట్రావెన్‌కోర్ దేవోస్వం బోర్డు ((టిడిబి) ఉద్యోగులను కూడా విచారణకు పిలుస్తామని అధికారులు చెబుతున్నారు.

కోర్టు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురారి బాబును 14 రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న బాబును బుధవారం రాత్రి పెరున్నలోని ఆయన నివాసం నుండి సిట్ అదుపులోకి తీసుకుని, తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో ప్రశ్నించిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు, అక్కడ ఆయన అరెస్టును అధికారికంగా నమోదు చేశారు. దేవస్వం బోర్డులో అనేక సంవత్సరాలు సీనియర్ పదవుల్లో పనిచేసిన బాబు, 2019 పునరుద్ధరణ ప్రక్రియలో తప్పుడు నివేదికను సమర్పించడం ద్వారా పొట్టితో కుమ్మక్కయ్యాడని సిట్ అనుమానిస్తోంది. అంతర్గత ఆడిట్ విభాగం గతంలో ఈ వ్యత్యాసానికి అతనిని బాధ్యునిగా నిర్ధారించింది.

ఈ కేసులో మురారి బాబు రెండవ నిందితుడు. మొదటి నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మరోవైపు.. శబరిమల బంగారు దొంగతనం కేసులో అసిస్టెంట్ ఇంజనీర్ కె. సునీల్ కుమార్‌ను టీడీబీ అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్ సస్పెండ్ చేశారు. ఈ కేసులో కుమార్‌ను నిందితుడిగా చేర్చారు.