నివురుగప్పిన నిప్పులా కేరళ : స్తంభించిన జనజీవనం

  • Publish Date - January 3, 2019 / 05:22 AM IST

పండళంలో బీజేపీ కార్యకర్త మృతి. 
ఎక్కడా తెరుచుకోని దుకాణ సముదాయాలు.
త్రిశూర్‌లో బస్సులపై రాళ్ల దాడి.
దాదాపు 60 బస్సులపై దాడి.
ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు.
ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు. 
అన్ని పరీక్షలను వాయిదా వేసిన కేరళ యూనివర్సిటీ. 

తిరువనంతపురం : కేరళ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఎక్కడికక్కడ ఆందోళనలు..నిరసనలు వ్యక్తం అవుతుండడంతో ప్రజాజీవనం స్తంభించింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణీకులు రోడ్లపై పడిగాపులు పడుతున్నారు. ఆటోలు కూడా తిరగడం లేదు. రోడ్లపై నిరసనకారులు ఆందోళన చేస్తుండడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు, లాఠీఛార్జీలకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. 
మహిళల ఆలయ ప్రవేశంపై ఆందోళనలు…
2019, జనవరి 02వ తేదీన 50 ఏళ్లలోపున్న ఇద్దరు మహిళలు శబరిమలలోని అయ్యప్పను దర్శించుకోవడంపై హిందూ సంఘాలు కన్నెర్ర చేశాయి. దీనివెనుక కేరళ ప్రభుత్వ హస్తం ఉందంటూ ఆరోపిస్తోంది. బ్లాక్ డేగా యూడీఎఫ్ అభివర్ణించింది. హిందూ సంఘాలు జనవరి 03వ తేదీన కేరళ బంద్‌కి పిలుపునిచ్చింది. బంద్‌లో బీజేపీ, హిందూ సంఘాలు, ఇతరులు పాల్గొంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇరుముడి లేకుండా దర్శనానికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీస ఆచారాలు పాటించకుండానే దర్శనం చేయించారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు కాలికట్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా వేసింది. 
Read More : కేరళలో ఫుల్ టెన్షన్ : కొనసాగుతున్న కేరళ బంద్
Read More : అయ్యప్ప ఆలయంలోకి మహిళ ఎంట్రీ ఎలాగంటే 

Read More : గురువారం కేరళ బంద్

ట్రెండింగ్ వార్తలు