నవంబర్ 16న శబరిమల యాత్ర ప్రారంభం.. కొవిడ్-19 సర్టిఫికెట్‌ తప్పనిసరి

  • Publish Date - August 11, 2020 / 05:42 PM IST

శబరిమల యాత్రకు కేరళ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. క‌రోనా నిబంధ‌న‌ల‌కు లోబ‌డి యాత్ర కొన‌సాగుతుంద‌ని కేర‌ళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుందని స్పష్టం చేశారు.

ఐసీఎమ్మార్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ల‌లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేర‌ళ ఆరోగ్య‌మంత్రి పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిట‌ళ్ల‌లో మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.

పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని చెప్పారు. అలాగే విపత్తు నిర్వహణల్లో భాగంగా హెలికాప్ట‌ర్‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు.