Sachin Tendulkar: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి సచిన్ సందేశం.. ఎందుకో తెలుసా?

తాను ఐఏఎఫ్‌లో భాగంగా ఉండడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నానని సచిన్ అన్నారు.

Anniversary of IAF: టీమిండియా మాజీ క్రికెటర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవ గ్రూప్ కెప్టెన్‌ సచిన్ టెండూల్కర్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఐఏఎఫ్ 91వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన వైమానిక దళ యూనిఫాం ధరించి కనపడ్డారు.

‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 91వ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ యూనిఫాం వేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఐఏఎఫ్ కు కృతజ్ఞతలు చెబుతున్నాను. చాలా గర్వంతో నేను ఈ యూనిఫాం వేసుకున్నాను.

తాను ఐఏఎఫ్‌లో భాగంగా ఉండడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నాను. టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడు ఏ విధంగా నాలోని ఫీలింగ్స్ ఉండేవో.. ఈ బ్లూ యూనిఫాం వేసుకున్న ప్రతిసారి కూడా అదే విధంగా ఉంటున్నాయి’ అని చెప్పారు. కాగా, 2010 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా సచిన్ కొనసాగుతున్నారు.

కాగా, ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వైమానిక యోధులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలని అన్నారు. మన దేశ వైమానిక దళ శౌర్యం, నిబద్ధత, అంకితభావానికి భారత్ గర్విస్తోందని చెప్పారు. వారి గొప్ప సేవలు, త్యాగాలు మన గగనతలం సురక్షితంగా ఉండేలా చేస్తున్నాయని అన్నారు.

Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌.. అనిల్‌కుంబ్లే రికార్డు బ్రేక్‌