Give Plastic Take Gold
Give Plastic Take Gold: ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయం. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. గ్రామాల్లోసైతం ప్లాస్టిక్ భూతం పట్టిపీడిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని ఓ చిన్న గ్రామంలో ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించేందుకు సర్పంచ్ నడుం బిగించాడు. 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి ఇస్తే ఒక బంగారు నాణెం ఇస్తానని ప్రకటించాడు. దీంతో గ్రామంలోని ప్రజలు రహదారులు, సైడ్ డ్రైయినేజీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని అందివ్వడం మొదలు పెట్టారు. ఫలితంగా పదిహేను రోజుల్లోనే గ్రామంలో రూపురేఖలు మారిపోయాయి. గ్రామం ప్లాస్టిక్ రహితంగా మారిపోయింది. దీంతో అధికారులు గ్రామాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్-2 కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు.
Flipkart: ఫ్లిప్‌కార్ట్ కిరాణా హోల్‌సేల్.. ‘వ్యాపారి దివస్’ పేరుతో కొత్త సేల్ ప్రారంభం
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా హిల్లర్ షాబాద్ బ్లాక్‌లో సాదివార గ్రామ ఉంది. ఈ గ్రామ సర్పంచ్‌గా ఫారూక్ అహ్మద్ కొనసాగుతున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ అవుతుండటంతో వాటిని పూర్తిస్థాయిలో నివారించాలని అనుకున్నాడు. వెంటనే గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఎవరైనా 20క్వింటాళ్లు తీసుకొస్తే వారికి ఒక బంగారు నాణెం ఇస్తానని ప్రకటించారు.
Viral Video: కెమికల్స్‌లో ముంచిన కూరగాయలు.. తర్వాత ఏమైందో తెలిస్తే షాక్
సర్పంచ్ ప్రకటనతో గ్రామస్తులు వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం వెలికి తీయడం ప్రారంభించారు. ఫలితంగా పదిహేను రోజుల్లోనే గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారిపోయింది.
Viral Video: రైల్వే స్టేషన్ లో టీసీతో గొడవపడి కన్నీరు పెట్టుకున్న యువతి
అధికారులు సాధివార గ్రామాన్ని స్వచ్ఛభారత్ అభియాన్-2 కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. గ్రామంతోపాటు సమీపంలోఉన్న వాగులు, నదులు కూడా శుభ్రమయ్యాయని సర్పంచ్ ఫారూక్ తెలిపారు. సాధివార గ్రామం స్ఫూర్తితో పలు గ్రామాలు తమతమ గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.