18మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం

Chhota Shakeel, Tiger Memon among 18 ‘designated terrorists’ under UAPA టెర్రరిజంపై కేంద్ర ప్ర‌భుత్వ పోరాటం కొన‌సాగూతూనే ఉంది. చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల ర‌క్ష‌ణ చ‌ట్టం(UPPA) 1967 కింద కొత్త‌గా 18 మందిని ఉగ్ర‌వాదులుగా ఇవాళ(అక్టోబర్-27,2020)కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేంద్రహోంశాఖ విడుదల చేసిన లిస్ట్ లో….సాజిద్ మీర్‌, యూసుఫ్ ముజ‌మ్మిల్‌, అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కి, షాహిద్ మెహ‌మూద్‌, ఫ‌ర్హ‌తుల్లా ఘోరీ, అబ్దుల్ రౌఫ్ అస్గ‌ర్‌, ఇబ్ర‌హీం అత్త‌ర్‌, యూసుఫ్ అజ‌హ‌ర్‌, షాహిద్ ల‌తిప్‌, స‌య్యిద్ మొహ‌మ్మ‌ద్ యూసుఫ్ షా, గులామ్ న‌బీ ఖాన్‌, జాఫ‌ర్ హుస్సేన్ భ‌ట్‌, రియాజ్ ఇస్మాయిల్ షాబాద్రి, మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, షేక్ ష‌కీల్‌, మ‌హ్మ‌ద్ అనిస్ షేక్‌, ఇబ్ర‌హీమ్ మీన‌న్‌, జావెద్ చిక్నా పేర్లు ఉన్నాయి.



18మంది ఉగ్రవాదులు
1. సాజిద్ మీర్‌….పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా(LeT) టాప్ కమాండర్. అంతేకాకుండా,26/11ముంబై ఉగ్రదాడికి ప్లాన్ చేసిన వ్యక్తులలో ఇతడు ముఖ్యమైనవాడు.
2. యూసుఫ్ ముజ‌మ్మిల్‌…జమ్మూకశ్మీర్ లో లష్కర్ ఏ తోయిబా ఆపరేషన్స్ కి కమాండ్ గా ఉన్నాడు. 26/11ముంబై ఉగ్రదాడి కేసులో ఇతడు కూడా నిందితుడు.
3. అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కి…లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది. అంతేకాకుండా,లష్కర్ ఏ తోయిబా రాజకీయ వ్యవహారాల హెడ్ గా కూడా ఉన్నాడు. లష్కర్ ఏ తోయిబాకు చెందిన విదేశీ సంబంధాల డిపార్ట్మెంట్ హెడ్ గా కూడా పనిచేశాడు.



https://10tv.in/missing-spo-joined-militant-ranks/
4.షాహిద్ మెహ‌మూద్‌….లష్కర్ ఏ తోయిబాకే చెందిన ఫలాహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్(FIF)డిప్యూటీ చీఫ్
5.ఫ‌ర్హ‌తుల్లా ఘోరీ….పాక్ కు చెందిన ఉగ్రవాది.2002లో ఢిల్లీలో అక్షరధామ్ ఆలయంపై ఉగ్రదాడి కేసులో నిందితుడు. 2005లో హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వద్ద సూసైడ్ ఎటాక్ లో కేసులో నిందితుడు.
6.అబ్దుల్ రౌఫ్ అస్గ‌ర్‌….పాక్ కు చెందిన ఉగ్రవాది. 2001లో భాతర పార్లమెంట్ పై ఉగ్రదాడి వెనుక ఇతడి హస్తం ఉంది.
7.ఇబ్ర‌హీం అత్త‌ర్‌…పాక్ కు చెందిన ఉగ్రవాది. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్(ఖాందహార్ హైజాకింగ్ కేసు) వెనుక ఇతడి పాత్ర ఉంది. అదేవిధంగా 2001లో భారత పార్లమెంట్ పై ఉగ్రదాడిలో ముఖ్య కుట్రదారు.



8.యూసుఫ్ అజ‌హ‌ర్‌…పాక్ కు చెందిన ఉగ్రవాది. డిసెంబర్-24,1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ కేసులో ఇతడు నిందితుడు
9.షాహిద్ ల‌తిప్‌….పాక్ కు చెందిన ఉగ్రవాది. పాక్ లోని సియాల్ కోట్ సెక్టార్ లో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్(JeM) కమాండర్. భారత్ లోకి జైషే ఉగ్రవాదులకు తరలిస్తున్నాడు. భారత్ లో ఉగ్రదాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడు.
10. స‌య్యిద్ మొహ‌మ్మ‌ద్ యూసుఫ్ షా…పాక్ కు చెందిన ఉగ్రవాది. ఉగ్రసంస్థ హిబ్జుల్ ముజాహిద్దీన్ కమాండర్. యునైటెడ్ జీహాద్ కౌన్సిల్(UJC)చైర్మన్. భారత్ లో ఉగ్రకార్యకలాపాలకోసం డబ్బులు సేకరించి..వాటిని భారత్ లోని తమ సంస్థ ఉగ్రవాదులకు అందిస్తుంటాడు.
11.గులామ్ న‌బీ ఖాన్‌…పాక్ కు చెందిన ఉగ్రవాది. ఉగ్రసంస్థ హిబ్జుల్ ముజాహిద్దీన్ డిప్యూటీ సుప్రీం
12.జాఫ‌ర్ హుస్సేన్ భ‌ట్‌…పాక్ కు చెందిన ఉగ్రవాది. ఉగ్రసంస్థ హిబ్జుల్ ముజాహిద్దీన్ ఆర్థిక వ్యవహారాలను చూస్తుంటాడు. కశ్మీర్ వ్యాలీలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు నిధులు అందించే వ్యవహారాల బాధ్యత ఇతనిది.



13.రియాజ్ ఇస్మాయిల్ షాబాద్రి…పాక్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ వ్యవస్థాపక సభ్యుడు. భారత్ లో అనేక ఉగ్రదాడుల వెనుక ఇతడి పాత్ర ఉంది. 2010 బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఉగ్రదాడి,2010లో జామా మసీద్ ఉగ్రదాడి,2011 ముంబై ఉగ్రదాడుల వెనుక ఇతడి హస్తం ఉంది.
14.మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌….పాక్ కు చెందిన ఉగ్రవాది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడు.
15. ఇబ్ర‌హీమ్ మీన‌న్‌…పాక్ కు చెందిన ఉగ్రవాది. ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు.



16.మ‌హ్మ‌ద్ అనిస్ షేక్‌….పాక్ కు చెందిన ఉగ్రవాది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడు.
17.షేక్ ష‌కీల్‌ లేదా చోటా షకీల్…దావూద్ ఇబ్రహీం అనుచరుడు. డీ-కంపెనీ అండర్ వరల్డ్ ఆపరేషన్స్ ను చూసుకుంటాడు. 1993లో గుజరాత్ కి గన్స్ స్మగ్లింగ్ కేసులో నిందితుడు. భారత్ లో డీ-కెంపీనీ ఆర్థికవ్యవహారాలు చూస్తుంటాడు.
18. జావెద్ చిక్నా…పాక్ కు చెందిన వ్యక్తి. దావూద్ అనుచరుడు. 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు.



జాతీయ భ‌ద్ర‌త‌ను బ‌లోపేతం చేయ‌డంలో, జీరో టాల‌రెన్స్ విధానంలో భాగంగా మోదీ స‌ర్కార్ ఈ 18 మంది వ్య‌క్తుల‌ను ఉగ్ర‌వాదులుగా గుర్తించిన‌ట్లు ఇవాళ‌ కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది. యూఏపీఏ చ‌ట్టంలోని నాలుగ‌వ షెడ్యూల్‌లో ఉగ్ర‌వాదుల‌ పేర్ల‌ను చేర్చింది.