Akhilesh Yadav : చంద్రబాబు అరెస్ట్ చట్టవిరుద్ధం : అఖిలేశ్ యాదవ్

చంద్రబాబు అరెస్ట్ ను అధినేత అఖిలేశ్ యాదవ్ ఖండించారు. చంద్రబాబు అరెస్టు,అనంతరం జరిగిన..జరుగుతున్న పరిణామాల గురించి అఖిలేశ్ యాదవ్ ఆరా తీశారు.టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి అఖిలేశ్ యాదవ్ ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధమని అన్నారు.

Akhilesh Yadav ..Chandrababu arrest

Akhilesh Yadav ..Chandrababu arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాద్ పార్టీ (Samajwadi Party) అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు,అనంతరం జరిగిన..జరుగుతున్న పరిణామాల గురించి అఖిలేశ్ యాదవ్ ఆరా తీశారు.టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి అఖిలేశ్ యాదవ్ ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధమని అన్నారు. యనమలను అడిగి అన్ని విషయాలు తెలుసుకున్న అఖిలేశ్ చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తానని తెలిపారు.

Akhilesh Yadav : చంద్రబాబు అరెస్టుపై అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అరెస్టు గురించి స్పందించిన అఖిలేశ్ ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయటం ట్రెండ్ గా మారిపోయిందని.. ఇది కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు కూడా ట్రెండ్ గా మారింది అంటూ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టటం నిరకుశపాలనకు నిదర్శమన్నారు.

చంద్రబాబు అరెస్టు పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందని..అరెస్ట్ చేసిన తీరు సరికాదని మమతా పేర్కొన్నారు. టీడీపీ హయాంలో తప్పు జరిగితే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి తప్ప కక్షపూరితంగా వ్యవహరించటం సరికాదన్నారు.

CM Mamata Banerjee : చంద్రబాబు అరెస్టుపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు