రైల్వే శాఖ సంచలన నిర్ణయం : సంఝౌతా ఎక్స్ ప్రెస్ రద్దు

భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ -పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. మార్చి-4 నుంచి ఈ రైలును రద్దు చేస్తున్నట్లు గురువారం (ఫిబ్రవరి-28,2019) ప్రకటించింది. వారంలో రెండు రోజులు బుధ, ఆదివారాల్లో ఈ రైలు ఢిల్లీ నుంచి అటారికి బయలుదేరుతుంది. ప్రయాణికులు అటారిలో దిగి వాఘాలో ఇదే పేరు(సంఝౌతా ఎక్స్ ప్రెస్)తో నడిపే రైలులోకి మారాల్సి ఉంటుంది.
Read Also : Booking Start : జియోఫోన్2 ఫ్లాష్ సేల్ సందడి

రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఢిల్లీ నుంచి అట్టారి వరకు షెడ్యూల్ ప్రకారమే నడుపుతామని బుధవారం ఉత్తర రైల్వే అధికారి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 24 గంటల్లోనే రైలును రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.

గురువారం(ఫిబ్రవరి-28,2019) ఉదయం సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పాక్ నిలిపివేసింది. దీంతో పాక్ నుంచి అటారికి రావాల్సిన ప్రయాణికులు లాహోర్ స్టేషన్ లో నిలిచిపోయారు. వేరే మార్గాల్లో వారిని అటారికి తరలించే ప్రయత్నాలు కొనసగుతున్నాయి.
Read Also : నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం

ట్రెండింగ్ వార్తలు