Skm
Samyukta Kisan Morcha : రైతులకు కేంద్రం ఇచ్చిన హామీల విషయాలు ఎంత వరకు వచ్చాయి ? భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై సంయుక్త కిసాన్ మోర్చా కీలక భేటీ నిర్వహిస్తోంది. రైతులకు కేంద్రం ఇచ్చిన హామీల పురోగతిని సమీక్షించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఎస్‌పి (MSP)పై ప్యానెల్ ఏర్పాటు, వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతులకు కేంద్రం ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు ఉన్న పురోగతి, భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి సమావేశమైంది. సంయుక్త కిసాన్ మోర్చా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని గాంధీ పీస్ ఫౌండేషన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుందని సమాచారం.
Read More : Uma Bharti : మద్యం షాపుపై దండెత్తిన ఉమా భారతి..రాళ్లతో దాడి చేసి సొంత ప్రభుత్వానికే ధమ్కీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా వ్యవసాయ సంఘాల రైతుల ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోవడం..అంతకంతకు ఆందోళనలు ఉధృతం దాల్చాయి. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు చట్టాలను ఉపసంహరించుకబోతున్నట్లు, రైతులకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు ఆందోళన సందర్భంగా రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత, చనిపోయిన రైతులకు పరిహారంతో సహా రైతుల ఆరు డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడానికి కేంద్రం అంగీకరించింది.
Read More : Canada accident : కెనడాలో వ్యాన్ ను ఢీకొన్ని ట్రాక్టర్.. ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి
గత ఏడాది డిసెంబర్ 9న ఆందోళనను సంయుక్త కిసాన్ మోర్చా నిలిపివేసింది. పంటల మద్దతు ధర సమస్య, లఖింపూర్ ఖేరీ విషయంలో జాతీయ కార్యాచరణ ప్రణాళిక, ప్రభుత్వం డిసెంబర్ 9, 2021న ఇచ్చిన హామీ లేఖపై సాధించిన పురోగతిపై సమీక్ష జరపాలని తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల స్మారక చిహ్నం నిర్మించే పథకంపై కూడా సమావేశంలో చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్ల నెరవేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రోడ్‌మ్యాప్ నిర్ణయించాలని సంయుక్త కిసాన్ మోర్చా భావిస్తున్నట్లు సమాచారం. అంతర్గత సమస్యలైన నిధులు, నియమాలు, నిబంధనలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రైతు సంఘాలపై నిర్ణయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియవచ్చే అవకాశం ఉంది.