Madhya Pradesh : నిబంధనలు ఉల్లంఘించి..రోడ్డెక్కారా…రామనామం రాయాల్సిందే

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా శిక్షలు అమలు చేస్తోంది.

Lord Ram Book : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంటుండడంతో ఆందోళన రేకేత్తిస్తోంది. ఈ వైరస్ కు చెక్ పెట్టడానికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తుండగా..కొన్ని ప్రాంతాల్లో 20 గంటల పాటు లాక్ డౌన్ విధిస్తున్నారు.

ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే..కొంతమంది కావాలనే అవసరం లేకుండానే రోడ్డెక్కుతున్నారు. వీరి తాట తీస్తున్నారు పోలీసులు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వినూత్నంగా శిక్షలు అమలు చేసున్నారు. గుంజీలు తీయించడం, మోకాళ్లపై నడిపించడం వంటివి చేస్తున్నారు.

అయితే..మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా శిక్షలు అమలు చేస్తోంది. నిబంధ‌న‌లు లెక్క‌చేయ‌కుండా అన‌వ‌స‌రంగా బ‌య‌టికి వ‌చ్చిన వారితో అక్క‌డి పోలీసులు ‘రామనామం’ రాయిస్తున్నారు. ఎవరైతే..నిబంధనలు ఉల్లంఘించారో..వారికి ఒక డెయిరీ ఇస్తున్నారు. అందులో ఒక పేజీ నిండా రామ..రామ అని రాయ‌మంటున్నారు.

Read More  : Ration Shops : నెలలో అన్ని రోజులూ రేషన్ షాపులు ఓపెన్

ట్రెండింగ్ వార్తలు