Savarkar and Jinnah both are Atheists says congress leader
Jinnah and Savarkar: కర్ణాటక రాష్ట్రంలో సావర్కర్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా, ఈ వివాదం నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ మహా సభ నేత వీర్ సావర్కర్, ముస్లిం లీగ్ నేత మహ్మద్ అలీ జిన్నా నాస్తికులంటూ వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా వాళ్లు నాస్తికులు కాబట్టే దేశాన్ని నాశనం చేశారనే ధోరణిలో ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ‘‘వీర సావర్కర్ ఆటో బయోగ్రఫి సరిగా చదవని, రాజకీయాల్లో ఆయన విధివిధానాలను సరిగా చదవని వారి గురించి నేనేం చెప్పాలి. సావర్కర్ నాస్తికుడు, అలాగే మహ్మద్ అలీ జిన్నా కూడా నాస్తికుడు. వీరిద్దిరూ దేశాన్ని నావనం చేశారు’’ అని కర్ణాటక కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ అన్నారు.
కాగా, హరిప్రసాద్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ ‘‘హరిప్రసాద్ చరిత్రను మరోసారి సరిగ్గా చదివితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీకి మహ్మద్ అలీ జిన్నా అంటే ప్రేమ. ఎందుకంటే దేశం విడిపోవడం వల్లనే కాంగ్రెస్ నేతలకు అధికారం వచ్చింది. ఇలాంటి అనవసర చర్చ గురించి నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు’’ అని అన్నారు.
కాగా, హరిప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సావర్కర్ హిందూ మహ సభ నేత. ఆయనను నాస్తికుడు అని ఎలా అంటారు? అలాగే మహ్మద్ అలీ జిన్నా మతం ఆధారంగా దేశాన్ని విభజించారు. ఆ వ్యక్తిని నాస్తికుడని అనడం మూర్ఖత్వమని విమర్శిస్తున్నారు. ఇక హరిప్రసాద్ వ్యాఖ్యలు చూస్తుంటే నాస్తికులు దేశాన్ని నాశనం చేస్తారనే ధోరణిలో ఉన్నాయంటూ విరుచుకుపడుతున్నారు.
Top 10 Demolished Buildings: ప్రపంచవ్యాప్తంగా నేలమట్టమైన అతిపెద్ద 10 భవనాలు ఏవో తెలుసా?